Fuel Shortage: “అందుకే బంకుల్లో స్టాక్ ఖాళీ అవుతోంది”.. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ బిగ్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Petroleum Dealers Association: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరతపై డీలర్స్ అసోసియేషన్ క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి అమరేందర్ రెడ్డి పేరిట ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ఇంధన కొరత లేదని, జనాలు పానిక్ అవ్వొద్దని స్పష్టం చేశారు. ఇంధన కొరత గురించి తప్పుడు, తప్పుదోవ పట్టించే వార్తలు ప్రచారం కావడం వల్ల చాలా మంది పెట్రోల్ బంకులకు పరుగులు తీసి అనవసరంగా తమ ట్యాంకులను నింపుకుంటున్న విషయం మా దృష్టికి వచ్చిందని నోట్‌లో పేర్కొన్నారు. ఈ భయాందోళన కొనుగోళ్ల కారణంగా అమ్మకాలు సాధారణ స్థాయిల కంటే దాదాపు 2.5 నుంచి 3 రెట్లు అసాధారణంగా పెరిగాయన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న అనేక రిటైల్ అవుట్‌లెట్లలో స్టాక్ తాత్కాలికంగా అయిపోయిందని పేర్కొన్నారు.
READ MORE: Redmi Note 15 SE 5G: రెడ్ మీ నోట్ 15 SE 5G లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 5520mAh బ్యాటరీ & 108MP కెమెరా
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ఇంధనం కొరత లేదని, HPCL, IOCL, BPCL వద్ద తగినంత స్టాక్ అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. ఇంధన సరఫరా సాధారణంగానే కొనసాగుతోందన్నారు. అనంతరం కొందరికి వార్నింగ్ ఇచ్చారు. పెట్రోల్ లేదా డీజిల్ను డబ్బాలలో నిల్వ కోసం తీసుకువెళ్లడం PESO నిబంధనలకు విరుద్ధమని.. తీవ్రమైన భద్రతా ప్రమాదాన్ని కలిగిస్తుందని స్పష్టం చేశారు. ఇంధనాన్ని సరిగ్గా నిల్వ చేయకపోవడం అగ్ని ప్రమాదాలతో సహా ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చని.. ఇది ఇంధనాన్ని నిల్వ చేయడానికి సురక్షితమైన లేదా ఆమోదించబడిన పద్ధతి కాదన్నారు. ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేశారు. భయాందోళనలకు గురికాకుండా ఇంధనాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. నకిలీ వార్తలను నమ్మవద్దు లేదా ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!