Site icon NTV Telugu

రేపు తెలంగాణ పీఈ సెట్ ఫలితాలు

నవంబర్ 1న సోమవారం నాడు తెలంగాణ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌-2021 ఫలితాలను విడుదల చేయనున్నట్లు పీఈ సెట్‌ కన్వీనర్‌ తెలిపారు. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆర్‌ లింబ్రాది, పీఈ సెట్‌ ఛైర్మన్‌, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సిలర్ గోపాల్‌రెడ్డి ఈ ఫలితాలను ప్రకటిస్తారని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

Also Read: నవంబర్ 1 నుంచి ఏం మారనున్నాయి?

కాగా యూజీడీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్‌ పీఈసెట్‌ (తెలంగాణ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌) పరీక్షలు మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇటీవల జరిగాయి. పూర్తి ఈవెంట్స్‌ ఎంజీయూలో జరుగాల్సి ఉండగా.. కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా 14 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి ఒకే రోజులో ఎంట్రన్స్ టెస్టు నిర్వహణను పూర్తి చేశారు.

Exit mobile version