Site icon NTV Telugu

Telangana Municipal Election: కౌంటింగ్‌కు ముందు బీజేపీకి బిగ్‌షాక్.. మరో అభ్యర్థి మృతి!

Bjp

Bjp

Telangana Municipal Election: తెలంగాణలో పురపోరు తుది ఘట్టానికి చేరుకుంది. నేడు ఉదయం 8 గంటలకే మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. మరి కొన్ని గంటల్లో 12,993 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 3 నుంచి 8 రౌండ్లలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 136 కౌంటింగ్ కేంద్రాల్లో మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తయింది. ప్రస్తుతం సాధారణ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల జిల్లా పరిధిలో బీజేపీ అభ్యర్థి మృతి చెందారు. లక్షెట్టిపేట 10వ వార్డు బీజేపీ అభ్యర్థి బత్తిని ఎల్లమ్మ అనారోగ్య కారణాలతో మృత్యువాత పడింది. దీంతో ఆ వార్డు శోక సంద్రంలో మునిగిపోయింది. కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కౌంటింగ్‌కు ముందే జరిగిన ఈ ఘటన అందరినీ కలిచి వేసింది.

READ MORE: Mohan Bhagwat: కుక్కల బెడదపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

Exit mobile version