NTV Telugu Site icon

Telangana Police : నేర విశ్లేష‌ణ మాడ్యూల్‌ అభివృద్దిలో తెలంగాణ ముద్ర

Telangana Police

Telangana Police

స‌మ‌న్వ‌య ప్లాట్‌ఫాంలో నేర విశ్లేష‌ణ మాడ్యూల్ అభివృద్దిలో తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ‌ చూపిన ప్ర‌తిభ‌కుగానూ కేంద్ర హోం శాఖ అవార్డును ప్ర‌దానం చేసింది. ఇండియ‌న్ సైబ‌ర్ క్రైమ్ కోఆర్డినేష‌న్ సెంట‌ర్ (I4C) మొద‌టి ఆవిర్భావ దినోత్స‌వాన్నిఢిల్లీ విజ్ఞాన్ భ‌వ‌న్‌లో మంగ‌ళ‌వారం నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా రాష్ట్ర సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్ట‌ర్ శిఖా గోయ‌ల్ అవార్డును స్వీక‌రించారు. నేర గ‌ణాంకాల విశ్లేష‌ణ‌, నేరాల మ‌ధ్య ఉన్న పోలిక‌ల ఆధారంగా వాటిని అనుసంధానించ‌డం, నేరగాళ్ల నెట్‌వ‌ర్క్‌ను గుర్తించ‌డం, దేశ‌వ్యాప్తంగా ఉన్న చ‌ట్ట సంబంధ విభాగాల‌ను స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డంలో తెలంగాణ పోలీసులు పోషిస్తున్న పాత్ర‌ను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు.

Dhavaleswaram Barrage: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక..

సైబర్ నేరాల నియంత్రణలో ఉత్తమ పనితీరును కనబరిచి జాతీయ స్థాయిలో ప్రశంసా పత్రాన్ని అందుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ముఖ్యమంత్రి @revanth_anumula అభినందించారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ వేదికగా జరిగిన ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ (I4C) ప్రథమ వార్షికోత్సవంలో కేంద్ర హోం మంత్రి @AmitShah చేతుల మీదుగా ఆ ప్రశంసా పత్రం అందుకున్న సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ గారికి, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ దేవేందర్ సింగ్ కి సీఎం గారు ప్రత్యేక శుభాభినందనలు తెలిపారు. సైబర్ నేరాల కట్టడికి జాతీయ స్థాయిలో ‘సమన్వయ్’ పేరుతో అనుసంధాన వ్యవస్థను రూపొందించడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోషించిన పాత్రకు కేంద్రం నుంచి ప్రశంసలు దక్కడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తు ప్రణాళికల్లోనూ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ కీలక పాత్ర పోషించాలని సీఎం అభిలాషించారు.

Dhavaleswaram Barrage: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక..