Supreme Court: నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ కొనసాగనుంది. జస్టిస్ దీపాంకరదత్త, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ల ధర్మాసనం కేసు విచారణ చేపట్టనుంది. రెండ్రోజుల క్రితం 5గురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తీర్పుపై స్పీకర్ తీర్పు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పష్టం చేశారు. అనర్హత పిటిషన్ లను కొట్టివేశారు. గత విచారణ సందర్భంగా.. స్పీకర్ నాలుగు వారాల్లోగా కోర్టు ధిక్కార పిటిషన్ పై జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా స్పీకర్ కు నోటీసులు అందజేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా ? అని గట్టిగానే ప్రశ్నించింది. తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టు ధిక్కర పిటిషన్ పై తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. 4 వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని స్పీకర్ తరపున న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, ముకుల్ రోహత్గి సమాధాన మిచ్చారు. ఈ రోజు ఏం జరగనుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
READ MORE: Heartbreaking Scene: హృదయవిధారక ఘటన.. ఉగ్రదాడిలో చనిపోయిన తండ్రి.. పప్పా లే అంటున్న చిన్నారి
