NTV Telugu Site icon

South Korea Tour: సియోల్ లో AI సిటీని సందర్శించనున్న తెలంగాణ అధికార బృందం..

Telangana Minissters

Telangana Minissters

South Korea Tour: నేడు దక్షిణ కొరియా సియోల్ లో తెలంగాణ అధికార బృందం మూడో రోజు పర్యటించనున్నారు.. సియోల్ లో AI సిటీని బృందం సందర్శించనుంచి. ప్యూచర్ సిటీ లో ఏర్పాటు చేయనున్న AI సిటీ పై సెమినార్ లో పాల్గొననుంది. అనంతరం స్మార్ట్ సిటీ పై కాన్పరెన్స్ లో పాల్గొంటారు. సాయంత్రం ఇండియన్ అంబాసిడర్ తో సమావేశం కానుంది. కొరియాలో అత్యంత ప్రతిష్ఠాత్మక స్మార్ట్ సిటీ ప్రాజెక్టులలో ఇంచాన్ స్మార్ట్ సిటీ ఒకటి. కొరియాలోని సాంగ్డో ప్రాంతంలో అభివృద్ధి చెందుతుంది. 1,500 ఎకరాలల్లో పర్యావరణ అనుకూల విధానాలతో ఇంచన్ స్మార్ట్ సిటీగా రూపొందింది. దక్షిణ కొరియాలో ఇంచన్ స్మార్ట్ సిటీ సాంగ్దో సూపర్-స్మార్ట్ నగరంగా మారింది.

Read also: Astrology: అక్టోబర్ 23, బుధవారం దినఫలాలు

అత్యాధునిక సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT) వినియోగం చెందింది. స్మార్ట్ సిటీలోనే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) సిటీగా పేరుపొంది. సాంగ్డో సిటీ మొత్తాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా కనెక్ట్ చేయడం లక్ష్యంగా IoT ప్రాజెక్ట్ రూపొందించారు. IoT ఆధారంగా నడుస్తున్న నివాస గృహాలు, కార్యాలయాలు, రవాణా వ్యవస్థలు, పార్కులు, షాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇళ్లలో టెంపరేచర్, సెక్యూరిటీ, విద్యుత్ వినియోగం వంటి అన్ని అంశాలను స్మార్ట్ ఫోన్స్ ద్వారా ఆపరేషన్ లాంటివి అక్కడ అభివృద్ది చెందాయి. రినవబుల్ ఎనర్జీ తో విండ్ టర్బైన్లు, సోలార్ ప్యానెల్లు, మరియు రీసైకిల్డ్ నీటి వ్యవస్థలను ఈసిటీ ఉపయోగిస్తుంది. ఇంచాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండటం వల్ల, ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, పర్యాటక హబ్‌గా సాంగ్డో మారింది.

Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

స్మార్ట్ టెక్నాలజీ ఆధారంగా ఆరోగ్య సంబంధిత సేవలు పని చేస్తున్నాయి. హాస్పిటల్స్, క్లినిక్స్ లో వర్చువల్ గానే కన్సల్టేషన్, డిజిటల్ మెడికల్ రికార్డులు ఉపయోగిస్తున్నారు. నగరంలో ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను ట్రాక్ చేస్తూ స్మార్ట్ ఫార్మింగ్, గ్రీన్ స్పేస్ మేనేజ్‌మెంట్‌ను అమలు చేస్తున్నారు. ప్రపంచంలోని పలు ప్రధాన కంపెనీలు ఇంచాన్ స్మార్ట్ సిటీలో తమ కార్యాలయాల ఏర్పాటు చేసుకుంటారు. వీటిలో సిస్కో, 3ఎం,ఇంటెల్ వంటి ఐటి, టెక్ కంపెనీలు ఉన్నాయి. సాంగ్డో IBD లో పలు అంతర్జాతీయ పాఠశాలలు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. సొరా ఇంటర్నేషనల్ స్కూల్, SUNY Korea, Incheon Global Campus వంటి ప్రముఖ విద్యాసంస్థలు.. సాంగ్డో నగర నిర్మాణం కోసం ఇప్పటివరకు దాదాపు 40 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. దీని వల్ల భవిష్యత్తులో ఈ నగరం దక్షిణ కొరియాలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రధాన స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నందున దీనిని పరిగణలోకి తీసుకుని తెలంగాణ కూడా ఇలాంటి సంస్థలు ఏర్పాటుకు తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం పర్యటిస్తున్నారు.
Hyderabad: మాదాపూర్ జోన్లో బార్లు, పబ్బులు, రెస్టారెంట్లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు..