Site icon NTV Telugu

Pawan Kalyan Controversy: పవన్‌ క్షమాపణ చెప్పకపోతే.. ఒక్క సినిమా కూడా ఆడదు.. కోమటిరెడ్డి వార్నింగ్..

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

Pawan Kalyan Controversy: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన కోనసీమ దిష్టి వ్యాఖ్యలపై పొలిటికల్‌ దుమారమే రేగుతోంది.. పవన్‌ కల్యాణ్‌ కామెంట్లపై ఘాటుగా స్పందిస్తున్నారు తెలంగాణ నేతలు.. పవన్‌ క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ ఒక్క సినిమా కూడా ఆడదంటూ వార్నింగ్‌ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. పవన్‌ కల్యాణ్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు..

Read Also: Mohan Bhagwat: మోడీ అందుకే వరల్డ్ లీడర్ అయ్యారు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

ఇక, పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలు నన్ను బాధించాయి.. భేషరతుగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్‌ చేశారు మంత్రి కోమటిరెడ్డి.. తెలంగాణ ప్రజల దిష్టి కాదు.. ఆంధ్రా పాలకుల వల్ల.. తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ విషం తాగారని ఆవేదన వ్యక్తం చేశారు.. పవన్ కల్యాణ్‌ క్షమాపణ చెప్పకపోతే.. ఒక్క సినిమా కూడా ఆడదు అని వార్నింగ్‌ ఇచ్చారు.. సినిమా ఆటోగ్రాఫి మంత్రిగా చెబుతున్నా.. క్షమాపణ చెప్పక పోతే.. ఒక్క థియేటర్ లో కూడా సినిమా విడుదల కాదు మీది అని హెచ్చరించారు.. అయితే, చిరంజీవి సూపర్ స్టార్.. ఆయన మంచోడు.. కానీ, పవన్ కల్యాణ్‌కు రాజకీయ అనుభవం లేదు అనుకుంటా.. అందుకే అలా మాట్లాడుతున్నారు అని వ్యాఖ్యానించారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి..

Exit mobile version