Site icon NTV Telugu

Pawan Kalyan Controversy: పవన్‌ కల్యాణ్‌కు తెలంగాణ మంత్రి కౌంటర్‌.. తలతిక్క మాటలు మానుకో..!

Vakiti Srihari

Vakiti Srihari

Pawan Kalyan Controversy: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పందంగా మారాయి.. గత వారం డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. కేశవదాసుపాలెం వద్ద శంకరగుప్తం, కేశనపల్లి డ్రెయిన్ నుంచి సముద్రపు నీరు పోటెత్తడం కారణంగా పాడైన కొబ్బరి పంటను పరిశీలించారు.. అయితే, ఈ సందర్భంగా పవన్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.. లేదంటే భవిష్యత్‌లో తెలంగాణలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని హెచ్చరించారు..

Read Also: Freedom Plan: ఒక్క రూపాయికే నెలంతా రీఛార్జ్.. ఫ్రీడమ్ ప్లాన్‌ తో వస్తున్న బీఎస్ఎన్ఎల్

ఇక, రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదు అని పవన్‌ కల్యాణ్‌కు హితవు చెప్పారు వాకిటి శ్రీహరి.. పవన్ కల్యాణ్‌ తలతిక్క మాటలు మానుకోవాలి.. తెలంగాణలో వనరులు వాడుకుని.. ఈ స్థాయికి ఎదిగావు.. మైలేజ్‌ పొందాలంటే.. పనితనం చూపించు.. కానీ, ఇలా కాదు అని సూచించారు.. ఇప్పుడు పవన్‌ ఇలా మాట్లాడటం సరికాదు.. అన్నదమ్ముల్లా విడిపోయాం.. కలిసుందాం అని పిలుపునిచ్చారు తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి.. కాగా, రాజోలు నియోజకవర్గ పర్యటనలో పవన్‌ కల్యా్‌ణ్‌ మాట్లాడుతూ.. పచ్చని కోనసీమకు దిష్టి తగిలిందని.. ఇక్కడ పచ్చని కొబ్బరి చెట్లను చూసే ప్రత్యేక రాష్ట్ర (తెలంగాణ) డిమాండ్ వచ్చిందేమో? అంటూ తెలంగాణ ఉద్యమానికి లింక్‌ చేసి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం విదితమే..

Exit mobile version