Minister KTR: రెండు సార్లు మంత్రి కావడానికి కారణం ఆ పేరే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: ఎన్టీఆర్ పేరు వల్లే రెండు సార్లు మంత్రి అయ్యానని మంత్రి కేటీఆర్ ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌పై కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద నిర్మించిన ఎన్టీఆర్ పార్కును మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. లకారం దగ్గర ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తారక రామారావు పేరులోనే అధికారం ఉందన్నారు. ఎన్టీఆర్ పేరు వల్లే తాను రెండు సార్లు మంత్రి అయ్యానన్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తన అదృష్టమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఎన్టీఆర్ ఆదర్శమని అన్నారు. భారతదేశంలో తెలుగు వారు ఉన్నారని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు.
తెలంగాణకు అస్తిత్వం ఉందని చాటిచెప్పిన ఘనత కూడా కేసీఆర్‌దేనని అన్నారు. రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా వద్దని అన్నారు. రాముడు ఎలా ఉంటాడో మనకు తెలియదు… కృష్ణుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు… ఎన్టీఆర్ మనకు రాముడు, కృష్ణుడు అని అన్నారు. పదవులకు ఎన్టీఆర్ వన్నె తెచ్చారన్నారు. ప్రజల్లో తనకున్న ఆదరణ ముందు.. తాను అలంకరించిన సీఎం పదవి చిన్నదేనని అన్నారు. తారక రాముడి ఆశీస్సులతో కేసీఆర్ శిష్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారని అన్నారు. ఎన్టీఆర్ ఎన్నో శిఖరాలను అధిరోహించారని…కానీ సీఎంగా హ్యాట్రిక్ కొట్టలేదని…ఆయన వదిలేసిన పనిని కేసీఆర్ పూర్తి చేస్తానన్నారు. సౌత్ ఇండియాలో ఏ సీఎం హ్యాట్రిక్ సాధించలేదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టనున్నారు. కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ సాధిస్తే ఎన్టీఆర్ ఆత్మకు శాంతి చేకూరుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు.
Harish Rao: శ్రీజ మోములో నూరేళ్లు చిరునవ్వు వెళ్లి విరియాలి.. మంత్రి హరీష్ రావు
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..