Site icon NTV Telugu

Minister KTR: రెండు సార్లు మంత్రి కావడానికి కారణం ఆ పేరే..!

Ntr Ramarao

Ntr Ramarao

Minister KTR: ఎన్టీఆర్ పేరు వల్లే రెండు సార్లు మంత్రి అయ్యానని మంత్రి కేటీఆర్ ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌పై కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద నిర్మించిన ఎన్టీఆర్ పార్కును మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. లకారం దగ్గర ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తారక రామారావు పేరులోనే అధికారం ఉందన్నారు. ఎన్టీఆర్ పేరు వల్లే తాను రెండు సార్లు మంత్రి అయ్యానన్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తన అదృష్టమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఎన్టీఆర్ ఆదర్శమని అన్నారు. భారతదేశంలో తెలుగు వారు ఉన్నారని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు.

తెలంగాణకు అస్తిత్వం ఉందని చాటిచెప్పిన ఘనత కూడా కేసీఆర్‌దేనని అన్నారు. రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా వద్దని అన్నారు. రాముడు ఎలా ఉంటాడో మనకు తెలియదు… కృష్ణుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు… ఎన్టీఆర్ మనకు రాముడు, కృష్ణుడు అని అన్నారు. పదవులకు ఎన్టీఆర్ వన్నె తెచ్చారన్నారు. ప్రజల్లో తనకున్న ఆదరణ ముందు.. తాను అలంకరించిన సీఎం పదవి చిన్నదేనని అన్నారు. తారక రాముడి ఆశీస్సులతో కేసీఆర్ శిష్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారని అన్నారు. ఎన్టీఆర్ ఎన్నో శిఖరాలను అధిరోహించారని…కానీ సీఎంగా హ్యాట్రిక్ కొట్టలేదని…ఆయన వదిలేసిన పనిని కేసీఆర్ పూర్తి చేస్తానన్నారు. సౌత్ ఇండియాలో ఏ సీఎం హ్యాట్రిక్ సాధించలేదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టనున్నారు. కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ సాధిస్తే ఎన్టీఆర్ ఆత్మకు శాంతి చేకూరుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు.
Harish Rao: శ్రీజ మోములో నూరేళ్లు చిరునవ్వు వెళ్లి విరియాలి.. మంత్రి హరీష్ రావు

Exit mobile version