Site icon NTV Telugu

Kaloji University : మెడికల్ సీట్స్ కోసం కౌంట్‌డౌన్ మొదలు.. మీ పేరు లిస్ట్‌లో ఉందా.?

Kaloji University

Kaloji University

NEET : తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్‌ 15న జనరల్‌ మెరిట్‌ జాబితాను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయనున్నట్లు తెలిపింది.

తాజా షెడ్యూల్‌ ప్రకారం, మొదటి విడత కౌన్సెలింగ్‌ సెప్టెంబర్‌ 16 నుంచి 19 వరకు కొనసాగుతుంది. విద్యార్థులు 17 నుంచి 19 మధ్య వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం సీట్లు కేటాయించబడిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 20 నుంచి 24లోగా ఆయా కాలేజీలలో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది.

మీరు పీల్చే సిగరెట్ విషం మీ ఊపిరితిత్తులని కాల్చేస్తుందని తెలుసా !

రెండో విడత కౌన్సెలింగ్‌ సెప్టెంబర్‌ 26 నుంచి 28 వరకు జరుగుతుంది. ఈ విడతలో సీట్లు పొందిన వారు సెప్టెంబర్‌ 29న కాలేజీలలో హాజరు కావాలి. ఆ తరువాత మాప్‌అప్‌ రౌండ్‌ నిర్వహించి, సెప్టెంబర్‌ నెలాఖరుకల్లా రాష్ట్ర కోటా కౌన్సెలింగ్‌ ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు యూనివర్సిటీ స్పష్టం చేసింది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ గడువును విద్యార్థుల విజ్ఞప్తి మేరకు మరోసారి పొడిగించారు. తొలుత సెప్టెంబర్‌ 10న సీట్ల కేటాయింపు చేయాల్సి ఉండగా, దాన్ని సెప్టెంబర్‌ 12కి వాయిదా వేసిన ఉన్నత విద్యామండలి తాజాగా గడువును సెప్టెంబర్‌ 14 వరకు పెంచినట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు మొత్తం 1,67,161 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, అందులో 1,54,022 మంది దరఖాస్తులు సమర్పించారు. వీరిలో 1,50,359 మంది విద్యార్థులు కాలేజీల ఎంపిక కోసం వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకున్నట్లు ఉన్నత విద్యామండలి వివరించింది.

Panic Attack: అలర్ట్.. పానిక్ అటాక్ ఎంటో తెలుసా… మీకు ఈ లక్షణాలు ఉన్నాయా!

Exit mobile version