Site icon NTV Telugu

Telangana Lok Sabha Result 2024: పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో బీజేపీ ఆధిక్యం

Telangana Leed

Telangana Leed

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 17 లోక్‌సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక స్థానానికి కౌంటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 120 కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు. 1855 ఓట్ల లెక్కింపు కౌంటింగ్ టేబుళ్లపై కొనసాగుతోంది. తెలంగాణ ఎన్నికల్లో మొత్తం 2,20,24,806 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ఓట్లలో 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరగనుండగా, మరికొద్దిసేపట్లో ఫలితాలు రానున్నాయి. ఇక భువనగిరి పార్లమెంట్‌ స్థానంలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్‌లో 117 ఓట్లతో విజయం సాధించారు.

బీజేపీ అభ్యర్థికి 3,976, కాంగ్రెస్‌కు 3,859, బీఆర్‌ఎస్‌కు 2,681 ఓట్లు వచ్చాయి. మెజారిటీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సికింద్రాబాద్‌లోనూ ఆ పార్టీ అభ్యర్థి కిషన్‌రెడ్డి 3,325 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. మహబూబ్‌నగర్ తొలి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. మల్కాజిగిరిలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ ముందంజలో ఉన్నారు. మహబూబ్‌నగర్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు డీకే అరుణ, బండి సంజయ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజ వేయనుంది. ఖమ్మం పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఆ పార్టీ అభ్యర్థి రామసహలం రఘురాంరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Exit mobile version