Site icon NTV Telugu

Telangana Local Body Elections 2025: మోగిన ఎన్నికల నగారా.. తొలి నోటిఫికేషన్ విడుదల..

Local Body Elections

Local Body Elections

Telangana Local Body Elections 2025: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది.. రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి.. తొలివిడతలో మొదటి విడతలో మొత్తం 53 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 292 మండలాల పరిధిలో ఉన్న 292 జడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.. నేటి నుంచి ఎల్లుండి వరకు తొలివిడత నామినేషన్లు స్వీకరిస్తారు.. 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత పోలింగ్ జరగనుంది… ఈనెల 12న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఎంపీటీసీలకు మండల కార్యాలయాల్లో, జడ్పీటీసీల కోసం జిల్లా పరిషత్‌ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 15 వరకు గడువు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. నవంబర్ 11న ఫలితాల ప్రకటిస్తారు.

READ MORE: Secundrabad : సికింద్రాబాద్‌ మారేడుపల్లి కంటోన్మెంట్‌ పరిధిలో అగ్ని ప్రమాదం

మరోవైపు.. మొదటి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల ప్రక్రియపై జిల్లా కలెకర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఐ.రాణీకుముదిని బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరు, గురువారం ఉదయం నుంచి నోటిఫికేషన్ల జారీ, ఇతర అంశాలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు, చేసిన సన్నాహాల గురించి ఆరా తీశారు. అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సూచించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని, ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ, నోటిఫికేషన్ల జారీకి సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్లు తెలిపారు. ఇప్పటికే ఎన్నికల అధికారులకు శిక్షణ, పునఃశ్చరణ శిక్షణ సైతం పూర్తైంది.

READ MORE: Hyderabad: హైదరాబాద్‌లో ‘ఐ లవ్ మహ్మద్‌’ బ్యానర్.. సీఎం యోగిని ఘోరంగా తిట్టిన ముస్లిం యువకులు(వీడియో)

Exit mobile version