Telangana Liquor Shop Scam: “పేరు దళితులది.. దందా సిండికేట్లది”.. లిక్కర్ షాపుల్లో బినామీల గుట్టురట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Liquor Shop Scam: తెలంగాణలో లిక్కర్ షాప్‌ల కేటాయింపులలో భారీ కుంభకోణం వెలుగులోకి వస్తోంది. ఎస్సీ వర్గాలకు రిజర్వ్ చేసిన మద్యం దుకాణాల్లో బినామీ వ్యవహారాలపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారించింది. ఇటీవల చందానగర్‌లో ఒక వైన్ షాప్‌ను బినామీ ప్రొహిబిషన్ చట్టం కింద ఐటీ అధికారులు సీజ్ చేశారు. తాజాగా ఇదే తరహాలో మల్కాజిగిరి, సరూర్‌నగర్, యాదాద్రి ప్రాంతాల్లోనూ అనుమానాస్పద లావాదేవీలు బయటపడింది. పేరుకు మాత్రమే ఎస్సీ వర్గాలకు చెందిన వ్యక్తులు షాప్ యజమానులుగా ఉండగా, అసలు కార్యకలాపాలు మాత్రం థర్డ్ పార్టీ సిండికేట్ సభ్యులే నిర్వహిస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. లైసెన్స్ పొందిన పలువురు వ్యక్తులు ఆదాయపు పన్ను సైతం దాఖలు చేయలేని స్థితిలో ఉండగా, లక్షల రూపాయల లైసెన్స్ ఫీజులు ఎలా చెల్లించారన్న దానిపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరిలో రిజర్వ్ చేసిన 20 లిక్కర్ షాప్‌లలో 10 షాప్‌లు బినామీల ద్వారా నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే మేడ్చల్‌లో 17 రిజర్వ్ లైసెన్స్ షాప్‌లలో 14 షాప్ యజమానుల ఆదాయం రూ.10 లక్షల కంటే తక్కువగా ఉన్నట్లు తేలింది. ఇక యాదాద్రి జిల్లాలో 29 షాప్‌లలో 21 షాప్‌ల కార్యకలాపాలను ఎస్సీలకు బదులుగా థర్డ్ పార్టీ వ్యక్తులే నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించారు.
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!