Site icon NTV Telugu

CM Revanth Reddy : హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు కోసం జపాన్ సంస్థలతో తెలంగాణ ఒప్పందం

Cm Revanth

Cm Revanth

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రం పునర్వినియోగం, మున్సిపల్ వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పునరుద్ధరణ వంటి కీలక రంగాల్లో జపాన్ ప్రముఖ సంస్థలతో లేఖా ఆఫ్ ఇంటెంట్ (LoI)పై సంతకాలు చేసుకుంది. ఈ భాగంగా, హైదరాబాద్‌లో “ఎకో టౌన్” ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

కిటాక్యూషూ నగరాన్ని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు తదితరులు అక్కడి మున్సిపల్ పరిపాలన, పునరుజ్జీవన విధానాలను అధ్యయనం చేశారు. ముఖ్యంగా, ప్రపంచంలో అత్యంత కాలుష్యంగా ఉన్న నగరంగా పేరు గాంచిన కిటాక్యూషూ ఎలా పర్యావరణ మిత్రంగా మారిందనే విషయాన్ని మేయర్ తకయూషి ప్రస్తావించారు.

CM రేవంత్ మాట్లాడుతూ, “వికాసం, ఉద్యోగావకాశాలు, సంపద సృష్టి మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణ కూడా ప్రభుత్వానికి ప్రాధాన్యం. ఈ రోజు జపాన్ ప్రముఖ సంస్థలైన EX రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పీ9 LLC, నిప్పాన్ స్టీల్ ఇంజనీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ లతో కలిసి పునర్వినియోగ విధానాలను తెలంగాణలో అమలు చేయడానికి ముందడుగు వేస్తున్నాం,” అని తెలిపారు.

అలాగే, కిటాక్యూషూ – హైదరాబాద్ నగరాల మధ్య “సిస్టర్ సిటీ” ఒప్పందం చేసుకోవాలనే మేయర్ తకయూషి సూచనను కూడా ముఖ్యమంత్రి సమర్థించారు. “ఇప్పటి నుంచి handshake కాదని, future generations కోసం నిర్మిస్తున్న బ్రిడ్జ్ అని భావించాలి” అని పేర్కొన్నారు.

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “టెలంగాణాలో పెట్టుబడి పెట్టే వారికి మేం ఫ్రెండ్లీ గవర్నమెంట్, రాబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్ల్డ్ వర్క్‌ఫోర్స్, పచ్చదనం & ఇన్నోవేషన్‌కు అనుగుణంగా ఉన్న అవకాశాలను కల్పిస్తున్నాం. జపాన్ సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఇది సరైన సమయం” అని వివరించారు.

జపాన్-తెలంగాణ మధ్య సంబంధాలను మరింత బలపరిచే క్రమంలో, హైదరాబాద్‌లో జపనీస్ భాషా పాఠశాల ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. మరోవైపు, మేయర్ తకయూషి, “మాకు యువత అవసరం ఉంది. స్కిల్డ్ వర్కర్లు కావాలి. మీరు పంపగలరా?” అని అడిగారు.

ఇరుపక్షాలు అనేక అంశాల్లో ఒప్పందాలు చేసుకోవడంతో పాటు, ఒక స్పష్టమైన సహకార మెకానిజం ఏర్పాటు చేయాలని భావించాయి. కిటాక్యూషూ నగరంలో మురసాకి నదిని ఎలా పునరుద్ధరించారో చూపుతూ రివర్ మ్యూజియం, రివర్ ఫ్రంట్ వాక్, రీసైక్లింగ్ ప్లాంట్‌లను తెలంగాణ ప్రతినిధులకు చూపించారు.

IPL 2025 : సగం ఐపీఎల్ అయిపోయింది భయ్య.. రికార్డులు చూద్దాం రండి..

Exit mobile version