Site icon NTV Telugu

ITI Admissions: పదో తరగతి పాసైన విద్యార్థులకు అలర్ట్.. ఐటీఐ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల..

Iti Admission

Iti Admission

ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఐటీఐ ట్రేడ్ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందుకోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను రాష్ట్ర ఉపాధి శిక్షణ కమిషనర్‌ కార్యాలయం ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2024-25 విద్య సంవత్సరంకు గాను ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలను కల్పించనున్నారు.

Avika Gor: కళ్ల అద్దాలతో కేక పెట్టించే ఫోజులతో అలరిస్తున్న అవికా గోర్….

ఇందుకోసం జూన్‌ 10వ తేదీలోగా అభ్యర్థులు ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలి. https://iti.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఇక ఇందులో ప్రవేశం కొరకు అర్హతలు చూస్తే పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మరి కొన్నింటినికి 8వ తరగతిని విద్యా అర్హతగా నిర్ణయించారు అధికారులు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, మెషినిస్ట్, ప్లంబర్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్, కార్పెంటర్, సీవోపీఏ, డ్రాఫ్ట్స్‌మ్యాన్ ట్రేడ్స్ ను అందచనున్నారు. వయోపరిమితిని 14 ఏళ్లు నిండి ఉండాలని అధికారులు నిర్ణయించారు.

Faf du Plessis: ఆ ఒక్క క్యాచ్ తో మ్యాచ్ మొత్తాన్ని తమవైపు తిప్పేసుకున్న డుప్లెసిస్..

ఇక సీట్ల కేటాయింపు వివరాలలోకి వెళితే అకడమిక్ మెరిట్ తో పాటు రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఆన్ లైన్ లో దరఖాస్తును చేసుకోవాలి. ఇందుకోసం రూ. 100 చెల్లించాలి. 16 మే , 2024 నుండి దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. 10 జూన్ , 2024 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ. ఇక ఆన్లైన్ దరఖాస్తులో వివరాలను నమోదు చేసే సమయంలో ఎలాంటి తప్పులు చేయవద్దు. ముఖ్యంగా సరైన మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ను నమోదు చేయాలి.

Exit mobile version