Site icon NTV Telugu

Inter Admissions : మొదలైన తెలంగాణ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల సందడి

Inter

Inter

Inter Admissions : తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల షెడ్యూల్‌ను విడుదల చేశాయి. ఈ మేరకు, మొదటి దశ దరఖాస్తుల స్వీకరణ ఇవాళ (మే 1, 2025) నుంచి ప్రారంభమైంది. విద్యార్థులు మే చివరి వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ,  ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (ఇంటర్ ఫస్ట్ ఇయర్) తరగతులు జూన్ 2, 2025 నుంచి ప్రారంభం కానున్నాయి.

Pakistan: ‘‘ కాశ్మీర్ వెళ్లండి, ఇక్కడేం పని’’.. పాక్ ఆర్మీ, పోలీసుల మధ్య ఘర్షణ.. వీడియో వైరల్..

కళాశాలల యాజమాన్యాలు మొదటి దశ అడ్మిషన్ల ప్రక్రియను జూన్ 30, 2025 నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పదో తరగతి ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలల్లో చేరేందుకు ఈ షెడ్యూల్ ఉపయోగపడుతుంది. కళాశాలలు తమ వెబ్‌సైట్‌లలో , నోటీస్ బోర్డులలో పూర్తి వివరాలను అందుబాటులో ఉంచుతాయి. విద్యార్థులు ఆయా కళాశాలల నిబంధనలు , అర్హత ప్రమాణాలను తెలుసుకొని దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.

 

Supreme Court: పహల్గామ్ ఉగ్రదాడిపై రేపు సుప్రీంకోర్టులో విచారణ..

Exit mobile version