తెలంగాణలో గ్రూప్ 1 అంశంపై తెలంగాణ హైకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. గ్రూప్ 1 అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పరీక్షలు రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2023 అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 21 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆ పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ ఈ ఏడాది మార్చి 10న విడుదల చేసింది. ఈ ఫలితాల్లో అభ్యర్థులకు వచ్చిన మార్కులపై అనేక అనుమానాలు తలెత్తాయి.
Also Read:KP Sharma Oli: సోషల్ మీడియా నిషేధంపై తప్పును అంగీకరించిన ప్రధాని ఓలి.. హింసపై దర్యాప్తుకు ఆదేశం
పరీక్షల్లో జెల్ పెన్నులు వాడటం, కోఠి మహిళా కాలేజీలో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది సెలెక్ట్ కావడం, తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువగా ఎంపిక కావడం, కేవలం 2 సెంటర్ల నుంచే టాపర్లు ఉండటం తదితర అంశాలపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. పరీక్షలు రద్దు చేయొద్దని కోర్టులో పిటిషన్ వేసిన ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు. గ్రూప్ 1 నియామకాల ప్రక్రియ చివరి దశలో ఉన్నందున ఎలా రద్దు చేస్తారని ఎంపికైన అభ్యర్థుల వాదన.. ఎలాంటి అవకతవకలు జరగలేదని హైకోర్టుకు తెలిపిన టీజీపీఎస్సీ.. ఇప్పటికే ఇరువురి పిటిషన్లపై వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ వివాదంపై సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు తన తీర్పును వాయిదా వేస్తున్నట్టు జూలై 7న ప్రకటించారు. ఇవాళ తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో అభ్యర్థుల్లో ఉత్కంఠత పెరిగింది.
