అమ్మను మించిన దైవం లేదు.. అమ్మంటే ఎవరికైనా పిచ్చి.. చెప్పలేనంత ఇష్టం ఉంటుంది.. అమ్మకు ఏదైనా కష్టం వచ్చిందంటే ఇక ఏ బిడ్డ అయిన తట్టుకోలేదు.. అలాంటి తల్లి ప్రాణపాయంలో ఉంటే.. ఇక బతకదని తెలిస్తే.. ఆ కన్నతల్లిని కాపాడుకునేందుకు ఏ కొడుకైనా ఎంతంటి సాహసానికైనా దిగుతాడు. తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి అయిన కాపాడుకోవాలని తెగ ఆరాట పడిపోతారు.. అలాంటి ఓ కొడుకు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది..
వివరాల్లోకి వెళితే..ఆంద్రప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి తన తల్లిని తిరిగి బతికించుకునేందుకు వందల కిలో మీటర్లు ప్రయాణించి మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి చర్చికి చేరుకున్నాడు. మృతదేహాన్ని చర్చి ముందు ఉంచి పాస్టర్ ను తన తల్లిని బతికించాలంటూ వేడుకున్నాడు. కానీ, ఆ చర్చి నిర్వాహకులు మాత్రం ఆ వ్యక్తిని అతను తీసుకొచ్చిన మృతదేహాన్ని చర్చిలోకి అనుమతించలేదు. పాస్టర్ లేడంటూ లోనికి అనుమతి లేదంటూ అతనిని బయటకు వెళ్లగొట్టారు.. ఆ కొడుకు మాత్రం పాస్టర్ వచ్చేవరకు ఇక్కడ నుంచి వెళ్లనని మొండిగా అక్కడే కూర్చున్నాడు..
ఒక మూడు గంటల పాటు ఆ చర్చి ముందే పడిగాపులు కాసాడు. నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చేసేది లేక తల్లి మృతదేహంతో సొంత ఊరికి పయనమయ్యాడు ఆ వ్యక్తి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లోని కల్వరి చర్చ్ ఎదుట జరిగింది. కల్వరి చర్చి పాస్టర్ ప్రవీణ్ పై అత్యంత నమ్మకం పెంచుకున్న రాజమండ్రి కి చెందిన ఓ వ్యక్తి తన తల్లిని తిరిగి బ్రతికించుకునేందుకు హైదరాబాద్ లోని ఆస్పత్రి నుండి బెల్లంపల్లికి బయలుదేరాడు. అయితే మార్గమధ్యలోనే తల్లి చనిపోవడంతో ఆ తల్లిని ఎలాగైనా పాస్టర్ బ్రతికిస్తాడని అనుకున్నారు.. కానీ స్థానికులు, చర్చీ నిర్వాహకుల కలిసి అతన్ని వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు.. కానీ ఆ వ్యక్తి వెళ్లకపోవడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి నచ్చ చెప్పడంతో వెళ్లిపోయాడు.. తన తల్లీ కోసం ఆ కుర్రాడు పడే భాధ అందరిని కదిలించి వేసింది..