Panchayat Elections Live Updates: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరుకు నేటితో తెరపడనుంది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. నేడు మూడో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. నేడు సాయంత్రానికి అభ్యర్థులు భవితవ్యం తేలనుంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోసం 43,856 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. చివరి విడత.. 36,452 వార్డుల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. 116 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 7,908 ఏకగ్రీవమయ్యాయి. 18 వార్డుల పోలింగ్‌పై కోర్టు స్టే విధించడంతో మిగిలిన 28,410 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. 75,725 అభ్యర్థులు బరిలోకి దిగారు. ఈ మూడో విడత ఎన్నికలకు సంబంధించిన ఎన్టీవీ లైవ్ అప్డెట్స్ మీకోసం..
-
ప్రారంభమైన కౌంటింగ్
మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
-
80.78% పోలింగ్ నమోదు
మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 80.78% పోలింగ్ నమోదు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఓటింగ్.
-
ముగిసిన తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
ముగిసిన తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్. పలు చోట్ల ఇంకా భారీగా క్యూలైన్లు. ఒంటి గంటలోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం. మొదట వార్డు స్థానాలు, తర్వాత సర్పంచ్ ఓట్లు లెక్కింపు.
-
ఓటు కోసం.. సైకిల్ పై 148 కి.మీ ప్రయాణం
సంగారెడ్డి: పంచాయతీ ఎన్నికల్లో ఓటేయడానికి హైదరాబాద్ నుంచి మనూర్ సైకిల్ పై 148 కి.మీ ప్రయాణం చేసిన మాజీ సైనికుడు మల్లయ్య. ఉదయం 4 గంటల 20 నిమిషాలకు BHEL నుంచి బయలుదేరి 10 గంటలకు మనూర్ చేరుకున్న మల్లయ్య. సైకిల్ పై వచ్చి ఓటు వేసి తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయిన మాజీ సైనికుడు.
-
నారాయణఖేడ్ (మం) తుర్కపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద ఓట్ చోరీ
సంగారెడ్డి : నారాయణఖేడ్ (మం) తుర్కపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద ఓట్ చోరీ.హైదరాబాద్ నుంచి స్వగ్రామం తుర్కపల్లికి ఓటేయడానికి వచ్చిన మహిళ. గుర్తింపు కార్డుపై ఇప్పటికే ఓటు వేసినట్టు ఉందని అధికారులు చెప్పడంతో షాక్ అయిన మహిళ. ఓటు వేయకుండా తిరిగి వచ్చిన మహిళ యాస్మిన్. తన ఓటు ఎవరో చోరీ చేశారని ఆందోళన.
-
కౌంటింగ్ ప్రక్రియ సమయంలో భద్రత పెంచుతాం. -డీజీపీ శివధర్ రెడ్డి
రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.కాసేపట్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. పోలింగ్ ప్రశాంతంగా ముగిసినా... కౌంటింగ్ ప్రక్రియ పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాం. గెలిచిన వాళ్ళు ర్యాలీలు నిర్వహించకుండా ఆదేశాలు ఉన్నాయి. కౌంటింగ్ ప్రక్రియ సమయంలో భద్రత పెంచుతాం. -డీజీపీ శివధర్ రెడ్డి
-
ఎన్నికల పోలింగ్ సరళిని ఎన్నికల పోలింగ్ సరళిని
మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని మాసబ్ ట్యాన్క్ లోని ఎన్నికల కమిషన్ కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించిన సీఎస్ రామకృష్ణ రావు, పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్
-
ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి-ఎస్పీ మహేశ్ బి గీతే.
రాజన్న సిరిసిల్ల జిల్లా : సమస్యాత్మక ప్రాంతం అయిన వీర్నపల్లి మండల కేంద్రంలోని ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. మూడో విడత ఎన్నికల్లో భాగంగా భద్రతా ఏర్పాట్ల పరిశీలన. పోలింగ్ నిర్వహణకు 730 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు, సిబ్బందికి పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి-ఎస్పీ మహేశ్ బి గీతే.
-
57.91 % పోలింగ్ నమోదు
రాష్ట్ర వ్యాప్తంగా 11 గంటల వరకు 57.91 % పోలింగ్ నమోదు
-
మెదక్ జిల్లాలో 60.56 శాతం పోలింగ్ నమోదు
-
వరంగల్ జిల్లాలో 58.65
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం.
వరంగల్ జిల్లాలో 58.65
హనుమకొండ జిల్లా 54.40
జనగామ జిల్లా 51.82
ములుగు జిల్లా 60.64
మహబూబాబాద్ జిల్లా 66.24
భూపాలపల్లి జిల్లాలో 58.13
-
సంగారెడ్డి జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 59.39 శాతం పోలింగ్ నమోదు. సిద్దిపేట జిల్లాలో 56.25 శాతం పోలింగ్ నమోదు
-
కరీంనగర్: కొనసాగుతున్న చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్. ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం.
జగిత్యాల 52.82శాతం
పెద్దపల్లి 57.22 శాతం
కరీంనగర్ 55.67 శాతం
రాజన్న సిరిసిల్ల 46.90 శాతం
-
పరస్పరం దాడులు చేసుకున్న రెండు పార్టీల కార్యకర్తలు.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అస్మత్పూర్ వార్డులో ఉద్రికత. కాంగ్రెస్ అభ్యర్థి పోలింగ్ బూత్‌లో ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆగ్రహం. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ. పరస్పరం దాడులు చేసుకున్న రెండు పార్టీల కార్యకర్తలు.
-
మొదటి రెండు గంటల్లో 23.52 శాతం పోలింగ్
తుదిదశ పంచాయతీ ఎన్నికల్లో జోరుగా పోలింగ్. మొదటి రెండు గంటల్లో 23.52 శాతం పోలింగ్. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల్లో క్యూ లు. 36 వేల 483 పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఓటింగ్.
-
చలిని లెక్కచేయకుండా ఓటు వేసేందుకు వస్తున్న ప్రజలు
తెలంగాణలో తుదిదశ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్. చలిని లెక్కచేయకుండా ఓటు వేసేందుకు వస్తున్న ప్రజలు. చివరి విడతలో 3,753 సర్పంచ్, 28,410 వార్డు స్థానాలకు పోలింగ్. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్.
-
కొమురంభీం జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం
కొమురంభీం జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం. ఓటమి భయంతో పురుగులమందు తాగిన రాస్‌పెల్లి సర్పంచ్ అభ్యర్థి రాజయ్య. పంచడానికి తన దగ్గర డబ్బులు లేవంటూ రాజయ్య ఆవేదన. ఓడిపోతానేమో అనే టెన్షన్‌లో ఆత్మహత్యాయత్నం. అభ్యర్థి రాజయ్యను ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు.
-
సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో ప్రశాంతంగా ప్రారంభమైన మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్. మూడు మండలాల్లో కలిపి మొత్తం 82 గ్రామ పంచాయతీలకు గాను 11 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం. మిగతా 71 గ్రామపంచాయతీలకు జరుగుతున్న ఎన్నికలు. పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు
-
పంచాయతీ ఎన్నికలకు నోచుకోని 7 గ్రామాలు
మహబూబ్‌నగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు నోచుకోని 7 గ్రామాలు. అమ్రాబాద్ మండలంలోని నల్లమల్ల షెడ్యూల్ ప్రాంతంలో ఓటర్లు లేకున్నా ఎస్టీ రిజర్వేషన్. నామినేషన్లు దాఖలు కాకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఏడు గ్రామాలు.
-
కరీంనగర్ జిల్లా సమాచారం..
కరీంనగర్ జిల్లా: చివరి విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం.. మూడు విడతల్లో పంచాయితీ ఎన్నికల పోలింగ్ కు నేటితో ముగింపు.. చివరి మూడో విడతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 408 స్థానాలకు నోటిఫికేషన్.. 22 ఏకగ్రీవం కావడంతో నేడు 386 స్థానాల్లో ప్రారంభం కానున్న పోలింగ్ ప్రక్రియ.. ఉమ్మడి జిల్లాలోని జిల్లాల వారీగా చూస్తే మూడో విడతలో కరీంనగర్ జిల్లాలో 111 గ్రామాలకు గాను ఇప్పటికే 3 ఏకగ్రీవం కావడంతో నేడు 108 స్థానాల్లో జరుగుతున్న పోలింగ్.. జగిత్యాల జిల్లాలో 119 గ్రామాలకు 6 ఏకగ్రీవం కావడంతో 113 స్థానాలకు జరుగుతున్న పోలింగ్.. పెద్దపెల్లి జిల్లాలో 91 స్థానాలకు 6 ఏకగ్రీవం కావడంతో 85 స్థానాల్లో జరుగుతున్న పోలింగ్.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 87 స్థానాలకు 7 ఏకగ్రీవం కావడంతో నేడు 80 పంచాయితీలకు జరుగుతున్న పోలింగ్.. మధ్యాహ్నం 1గంటల వరకే ఓటింగ్.. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం.. తొలి గంటలోనే వెలువడనున్న చిన్న పంచాయతీల ఫలితాలు.. నేటితో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మొత్తం 1224 గ్రామ పంచాయితీలకు ముగియనున్న ఎన్నికల ప్రక్రియ..
-
ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలింగ్‌కు సర్వం సిద్ధం..
ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కి సర్వం సిద్ధం.. ఉదయం 7 గంటల నుంచి మద్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్.. మూడో విడతలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 580 గ్రామ పంచాయతీలు, 4920 వార్డులు.. ఇందులో మొత్తం 62 సర్పంచ్ స్థానాలు, 978 వార్డులు ఏకగ్రీవం.. సంగారెడ్డి జిల్లాలో మూడో విడతలో 8 మండల్లాల్లోని 234 గ్రామ పంచాయతీలు, 1960 వార్డుల్లో... 27 సర్పంచ్ స్థానాలు, 422 వార్డులు ఏకగ్రీవం.. మిగతా 207 సర్పంచ్ స్థానాలకు బరిలో 576 మంది అభ్యర్థులు.. మెదక్ జిల్లాలో 7 మండలాల్లోని 183 గ్రామ పంచాయతీలు, 1528 వార్డుల్లో... 22 సర్పంచ్ స్థానాలు, 307 వార్డులు ఏకగ్రీవం.. మిగతా 161 సర్పంచ్ స్థానాలకు బరిలో 506 మంది అభ్యర్థులు.. సిద్దిపేట జిల్లాలో 9 మండలాల్లోని 163 గ్రామ పంచాయతీలు, 1432 వార్డుల్లో...13 సర్పంచ్ స్థానాలు, 249 వార్డులు ఏకగ్రీవం.. మిగతా 150 సర్పంచ్ స్థానాలకు బరిలో 587 మంది అభ్యర్థులు
-
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్‌కు సర్వం సిద్ధం..
మొత్తం గ్రామ పంచాయితీలు- 165
ఏకగ్రీవం అయిన జీపీలు- 19
పోలింగ్ జరిగే జీపీలు- 146
పోటీలో ఉన్న అభ్యర్థులు- 562
పోలింగ్ కేంద్రాలు- 1490
వెబ్ క్యాస్టింగ్ సెంటర్లు- 51కామారెడ్డి జిల్లా..
మొత్తం గ్రామ పంచాయితీలు - 168
ఏకగ్రీవం అయిన జీపీలు - 26
పోలింగ్ జరిగే జీపీలు - 142
పోటీలో ఉన్న అభ్యర్థులు - 462
పోలింగ్ కేంద్రాలు- 1,410
వెబ్ క్యాస్టింగ్ సెంటర్లు- 63
-
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమాచారం..
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చివరి విడత పంచాయతీ ఎన్నికల వివరాలు.. మూడో విడతలో నాలుగు జిల్లాల్లో 20 మండలాల్లో 494 జీపీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్.. 45 పంచాయతీలు ఏకగ్రీవాలు... కొమురం భీం జిల్లాలో 4 మండలాల్లో 108 జీపీలకు నోటిఫికేషన్ విడుదల.. రెండు పంచాయతీలు ఏకగ్రీవం కాగా మరో రెండు పంచాయతీలకు నామినేషన్లు రాలేదు.. 104 జీపీలకు ఎన్నికలు.. నిర్మల్ జిల్లాలో 5 మండలాల్లో 133 జీపీలకు ఎన్నికలు. ఇందులో 9 జీపీలు ఏకగ్రీవాలు.. ఆదిలాబాద్ జిల్లాలో జిల్లాలో 6 మండలాల్లో 151 పంచాయతీలకు నోటిఫికేషన్ 30 ఏకగ్రీవం.. ఓ గ్రామ పంచాయతీలో దాఖలు కాని నామినేషన్.. 120 ఎన్నికలు. మంచిర్యాల జిల్లా మొత్తం 5 మండలాల్లోని 102 జీపీలకు ఎన్నికలు.. 4 చోట్ల ఏకగ్రీవం..
-
పాలమూరులో చివరి విడత వివరాలు..
మహబూబ్ నగర్ జిల్లా: నేడు మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్.. 27 మండలాల్లో 563 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు.. 52 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం, 504 స్థానాలకు పోలింగ్.. బరిలో 1620 సర్పంచ్, 9,728 వార్డు అభ్యర్థులు.. సర్పంచ్ ఎన్నికలకు నోచుకోని 7 గ్రామాలు.. అమ్రాబాద్ మండలంలోని నల్లమల షెడ్యుల్ ప్రాంతంలో ఓటర్లు లేకున్నా ఎస్టీ రిజర్వేషన్.. నామినేషన్లు దాఖలు కాకపోవడంతో ఎన్నికలకు దూరంగా కల్ములోనిపల్లె, ప్రశాంత్ నగర్, కుమ్మరోనిపల్లి, వంగూరోనిపల్లి, BK లక్ష్మాపూర్ గ్రామాలు.. గోకారం రిజర్వాయర్ ముంపు తగ్గించాలని చారగొండ మండలం ఎర్రవల్లిలో ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్థులు.. జడ్చర్ల మండలం శంకరాయపల్లిలో ఓటర్లు లేకున్నా ఎస్టీ రిజర్వేషన్ రావడంతో సర్పంచ్ స్థానానికి లేని ఎన్నికలు..
