Caste Census: సర్వే పూర్తి చేయించుకొని కుటుంబాలకు మరో అవకాశం
- కుటుంబ సర్వే పూర్తి చేయించుకొని కుటుంబాలకు మరో అవకాశం.
- ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 28, 2025 వరకు అవకాశం.
- గణనను పూర్తిచేసుకోవడానికి మూడు మార్గాలను సూచించిన ప్రభుత్వం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Caste Census: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటి (ఫిబ్రవరి 16) నుంచి ఫిబ్రవరి 28, 2025 వరకు సర్వే పూర్తిగా చేయించుకొని కుటుంబాలకు మరో అవకాశం కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. తాళం వేసి ఉన్న ఇళ్లు, ఆసక్తి లేని కుటుంబాలు వంటి కారణాలతో సర్వే జరగని ఇళ్ల సంఖ్య 3,56,323గా నమోదైంది. ఈ గృహాలు తమ గణనను పూర్తిచేసుకోవడానికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.
Read Also: Elon Musk: తన కొడుకుకు ఇండియన్ సైంటిస్ట్ పేరు పెట్టిన ఎలాన్ మాస్క్.. ఇంతకీ ఎవరతను?
Also Read
- Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
గణనను పూర్తిచేసుకోవడానికి మూడు మార్గాలను ప్రభుత్వం సూచించింది.
* టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం:
తెలంగాణలో ఎక్కడి నుండైనా 040-21111111 నంబర్‌కు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కాల్ చేయవచ్చు. వ్యక్తిగత వివరాలను ధ్రువీకరించిన తర్వాత, అధికారుల ద్వారా ఒక ఎన్యుమరేటర్ మీ ఇంటికి వచ్చి గణన ప్రక్రియను పూర్తి చేస్తారు.
* ప్రజాపాలన సేవా కేంద్రాల (PPSK) ద్వారా నమోదు:
గ్రామీణ ప్రాంతాల్లోని MPDO కార్యాలయాల్లో, పట్టణాల్లోని వార్డు కార్యాలయాల్లో గణన పూర్తి చేసుకోవచ్చు. శిక్షణ పొందిన సిబ్బంది ప్రజలకు సర్వే ఫారమ్ నింపడంలో సహాయపడతారు.
Read Also: New Delhi : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. 18 మంది మృతి
* ఆన్‌లైన్ ఫారమ్ డౌన్‌లోడ్ & సమర్పణ
సర్వే ఫారమ్‌ను https://seeepcsurvey.cgg.gov.in వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తిగా నింపి, సంతకం చేసిన అనంతరం సమీపంలోని ప్రజాపాలన సేవా కేంద్రంలో సమర్పించాల్సి ఉంటుంది.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇంకా గణన చేయించని కుటుంబాలు తమ వివరాలను అధికారికంగా నమోదు చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
-
Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్‌బై?.. ఇదే ప్రూఫ్!
-
Ram Gopal Varma : పెద్ద స్లార్లకు, భారీ బడ్జెట్ డైరెక్టర్లకు RGV కౌంటర్… హాలీవుడ్ హారర్ పై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Ram Charan : ‘పెద్ది’ని చూసి రామ్ చరణ్ ఎమోషనల్… వీడియో వైరల్
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!