తెలంగాణ ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. గతంలో కూడా వరుస నోటిఫికేషన్ లను విడుదల చేసింది ప్రభుత్వం.. ఇప్పుడు కూడా వరుస ప్రభుత్వ శాఖలకు సంబందించిన వాటిల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు .. ఈ మేరకు నిరుద్యోగుల పాలిట ఆపన్న హస్తం అవుతుంది.. రాష్ట్రం లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 మంది గెస్ట్ లెక్చరర్లు నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇంటర్మీడియెట్ కమిషనర్ నవీన్ మిత్తల్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. నియామక మార్గదర్శకాలను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం..
గెస్ట్ లెక్చరర్లకు ప్రభుత్వం ఒక్కో పీరియడ్ నిమిత్తం రూ.390 చెల్లిస్తుంది. నెలకు 72 పీరియడ్లకు మాత్రమే అనుమతిస్తుంది. దీంతో వారికి రూ.28,080 చొప్పున వేతనం అందుతుంది. జిల్లా కలెక్టర్ నేతృత్వం లో జిల్లా ఇంటర్ విద్యా శాఖ అధికారి, ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు సభ్యులుగా నియామక కమిటీని ఏర్పాటు చేస్తారు. జిల్లాల్లో కాలేజీల వారీగా ఖాళీలను ఈ నెల 19న వెల్లడిస్తారు. 24వ తేదీ లోగా అన్ని అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. జులై 26వ తేదీన దరఖాస్తులను పరిశీలించి మెరిట్ అభ్యర్థుల జాబితా రూపొందిస్తారు..
ఇక వచ్చే నెల 1 నుంచి సెలెక్ట్ అయిన కాలేజీలకు రిపోర్ట్ చెయ్యాల్సి ఉంది.. అప్పటి నుంచే కాలేజీలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇకపోతే తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. TSPSC Group 1 ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2.3 లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. ఈ వారాంతంలో విడుదలయ్యే అవకాశం ఉంది.. వీటితో పాటు పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసే పనిలో ఉంది తెలంగాణ సర్కార్..
