NTV Telugu Site icon

Telangana : కీసరలో ఘోర రోడ్డు ప్రమాదం..స్పాట్ లోనే ఇద్దరు మహిళలు మృతి..

Keesara

Keesara

తెలంగాణాలో రోజూ రోజుకు యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి.. అతి వేగం మే అందుకు కారణం అని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు.. అయిన వాహనదారులు వినకుండా ప్రాణాల ను పోగొట్టుకుంటున్నారు.. ప్రాణాలను తీస్తున్నారు.. మొన్నీమధ్య మైనర్ కారు యాక్సిడెంట్ మరువక ముందే ఇప్పుడు మరో దారుణ ఘటన జరిగింది.. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. కీసరాలో ఈ ప్రమాదం జరిగింది.. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాద్గార్‌పల్లి సమీపంలో ఓ డీసీఎం వ్యాన్ కూలీలను ఢీకొట్టింది.

వ్యాన్ వేగంగా వచ్చి ఢీ కొట్టడం తో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఔటర్ రింగ్ రోడ్డుపై మహిళలు పారిశుద్ధ్య పనులు చేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది..మృతులను లింగమ్మ, తిరుపతమ్మ గా పోలీసులు గుర్తించారు. మృతులు బీరంగూడ ప్రాంతానికి చెందిన వారని పోలీసులు చెప్పారు. మరోవైపు, ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన పది నిమిషాలకే అక్కడే మరో ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని చూస్తూ ఓ డ్రైవర్ నిర్లక్ష్యంగా ఆటో ను నడిపాడు.. దాంతో డ్రైవర్ అదుపు చెయ్యలేకపోవడంతో ఆటో బోల్తా పడింది..

ఈ ప్రమాద సమయంలో ఆటో ఎవ్వరు లేరని పోలీసులు తెలిపారు.. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ పై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. అదే సమయంలో మృతులు లింగమ్మ, తిరుపతమ్మ బంధువులు ఔటర్ రింగ్ రోడ్డు పనుల కాంట్రాక్టర్ రావాలంటూ అంబులెన్స్ ను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, మృతుల బంధువులకు మధ్య వాగ్వాదం జరిగింది.. కాసేపు రోడ్డు పై పెద్ద మాటల యుద్ధం జరిగింది.. కాసేపటికి క్రాంట్రాక్టర్ రావడంతో గొడవ సర్దు మణిగింది.. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృత దేహాలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..