NTV Telugu Site icon

Cinema Tickets : సినిమా టికెట్ ధరలపై తెలంగాణ సర్కార్ నిర్ణయాన్ని ఆహ్వానించిన ఎగ్జిబిటర్స్

New Project (81)

New Project (81)

Cinema Tickets : విడుదలవుతున్న పెద్ద సినిమాల టికెట్ ధరల పెంపుదల వల్ల సగటు ప్రేక్షకులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ భావిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుదల అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ కీలక సమావేశం నిర్వహించింది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో టికెట్ రేట్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని ఏపీ ఎగ్జిబిటర్లు కూడా స్వాగతించారు. దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం కూడా కోరింది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు.

Read Also:Jr. NTR : వార్ – 2 షూటింగ్ ముగిసింది.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?

కొత్త సినిమా విడుదలైన రెండు, మూడు రోజుల పాటు అభిమానులు, కళాశాల విద్యార్థులు, యువత, ప్రజల నుంచి టికెట్ ధరలు పెంచడం బాధాకరమని ఎగ్జిబిటర్లు తెలిపారు. అన్ని సినిమాలకు టికెట్ ధరలు నిర్ణీత మొత్తంలో ఉండేలా చూసుకోవాలని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్ దిల్ రాజును కోరినట్లు ప్రకటించారు. ఈ విషయంలో సీఎం రేవంత్, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పలు సినిమాలకి గాను వాటి బడ్జెట్ లు నిర్మాతల సౌలభ్యత కోసం ఉన్న ధరలపైనే భారీ మొత్తంలో పెంపుదల అందుకున్న చిత్రాలు చాలా ఉన్నాయి. అయితే ఈ చిత్రాల్లో ఇటీవల వచ్చిన పుష్ప 2 కి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు హైక్ దక్కింది.

Read Also:Devara 2 : మరోసారి బాక్సాఫీసు మీద దండయాత్ర చేసేందుకు రెడీ అవుతున్న దేవర

కానీ దీనిపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. దీనితో తెలంగాణ ప్రభుత్వం లేటెస్ట్ గా టికెట్ ధరలను నియంత్రిస్తామని తెలిపింది. అయితే లేటెస్ట్ గా ఈ నిర్ణయాన్ని తెలంగాణ సినీ ఎగ్జిబిటర్స్ ఆహ్వానించారు. సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్ణయాన్ని తాము ఆహ్వానిస్తున్నట్టుగా లేటెస్ట్ ప్రెస్ కాన్ఫిరెన్స్ లో తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్ విజేందర్ రెడ్డి అలాగే ఆంధ్ర ఎగ్జిబిటర్ల సెక్టార్ చైర్మన్ టి ఎస్ రామ్ ప్రసాద్ అలాగే తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెక్రటరీ బాలగోవింద్ లు ఆల్రెడీ ఈ టికెట్ ధరల విషయంలో ఎలా ఉంటే బాగుంటుంది అని మాట్లాడుకున్నాము అని ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.

Show comments