Site icon NTV Telugu

EV Bike On Subsidy: రూ.లక్ష బండిపై 90 శాతం సబ్సిడీ.. రేపటి నుంచి దరఖాస్తులు…

Ev Bikesss

Ev Bikesss

హైదరాబాద్ జిల్లాలోని నిరుద్యోగ ఎస్సీ (SC) యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతమైన అవకాశం కల్పించింది. హైదరాబాద్ కలెక్టరేట్ తాజాగా వెలువరించిన ప్రకటన ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాల (EV) కొనుగోలుపై భారీ సబ్సిడీని ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ పథకం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సిడీలను అందజేస్తోంది. 2 వీలర్ వాహనాల కొనుగోలుపై 90 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది. 3 వీలర్ వాహనాలపై 70 శాతం వరకు సబ్సిడీ వర్తిస్తుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఈ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. కుల ధృవీకరణ పత్రం (Caste Certificate).. ఎస్సీ వర్గానికి చెందినవారై ఉండాలి. ఆదాయ ధృవీకరణ పత్రం.. ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండాలి. రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgobmms.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమై మార్చి 26వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.

హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ఈ విషయాన్ని తెలియజేస్తూ.. అర్హులైన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసేటప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా పత్రాలను సరిచూసుకోవాలని.. నిర్ణీత గడువులోపు దరఖాస్తు పూర్తి చేయాలని ఆమె సూచించారు.

Exit mobile version