Site icon NTV Telugu

Telangana Elections 2023: ఓటర్లు లేక వెలవెలబోతున్న పోలింగ్ కేంద్రం.. కారణం ఏంటంటే?

Untitled Design (3)

Untitled Design (3)

Varipeta Peoples Protest: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. తెలంగాణ ఓవర్లు అందరూ క్యూ లైన్‌లో నిల్చుని తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. జనాలతో ప్రతి పోలింగ్ బూత్ కళకళలాడుతోంది. అయితే ఓ పోలింగ్ బూత్ మాత్రం ఓటర్లు లేక వెలవెలబోతోంది.

Also Read: Telangana Elections 2023: డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు పక్కా: శ్రీధర్ బాబు

బెల్లంపల్లి నియోజకవర్గం కాసిపేట మండలం వరిపేట గ్రామ పోలింగు కేంద్రం ఓటర్లు లేక వెలవెలబోతోంది. తమ గ్రామాన్ని గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ.. వరిపేట ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. ఉదయం 9.30 గంటల వరకూ కేవలం 12 మంది ఓటర్లు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Exit mobile version