Site icon NTV Telugu

Telangana DGP: తెలంగాణ నూతన డీజీపీగా రవిగుప్తా నియామకం!

Ravi Gupta

Ravi Gupta

తెలంగాణ నూతన డీజీపీగా రవి గుప్తాను నియమించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ.. ప్రస్తుత డీజీపీ అంజనీ కుమార్‌పై ఎన్నికల సంఘం (ఈసీ) ఈ రోజు మధ్యాహ్నం సస్పెన్షన్ వేటు వేసింది. దాంతో అంజనీ స్థానంలో రవిగుప్తాను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అంజనీ కుమార్‌తో పాటు ఇద్దరు అదనపు డీజీలు సందీప్‌కుమార్‌ జైన్‌, మహేశ్‌ భగవత్‌కు కూడా ఈసీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

డీజీపీ అంజనీ కుమార్‌ను ఈ రోజు మధ్యాహ్నం ఈసీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఎలా కలుస్తారని ఈసీ సీరియస్ అయ్యింది. పూర్తిస్థాయి ఫలితాలు రాక ముందే.. రేవంత్ రెడ్డిని కలిసినందుకు గాను అంజనీ కుమార్‌పై ఈసీ చర్యలు తీసుకుంది. రేవంత్ రెడ్డిని కలిసిన డీజీపీ పుష్పగుచ్ఛం అందించి.. విషెస్ తెలిపారు. రేవంత్‌కు భద్రత కల్పించే అంశంపై డీజీపీ చర్చించినట్లు తెలుస్తుంది.

డీజీపీ అంజనీ కుమార్‌పై వేటు పడటంతో ఒక్కసారిగా పోలీస్ శాఖ్ షాక్‌కు గురైంది. అయితే ఈ సస్పెన్షన్ ఎన్ని రోజుల పాటు ఉంటుందో ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు రవిగుప్తా 1990 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిగా ఉన్నారు. ప్రస్తుతం రవిగుప్తా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంతో పాటు ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్నారు.

Exit mobile version