Site icon NTV Telugu

Telangana CS: తెలంగాణ సీఎస్ పదవీ కాలం పొడిగింపు..

Tgcs

Tgcs

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కె. రామకృష్ణారావు పదవీ కాలం పొడిగింపుపై గత కొద్దిరోజులుగా సాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఆయన సర్వీసును మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక ఉత్తర్వులు అందాయి. తాజా పొడిగింపుతో రామకృష్ణారావు జూన్ నెలాఖరు వరకు తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. వాస్తవానికి రామకృష్ణారావు గతేడాది ఆగస్టు 31నే పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే.. రాష్ట్రంలో పాలనాపరమైన అవసరాలు, కీలక ప్రాజెక్టుల అమలు దృష్ట్యా ఆయన సేవలు మరికొంత కాలం అవసరమని భావించిన ప్రభుత్వం, గతంలోనే ఏడు నెలల పొడిగింపు కోరింది. ఆ గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగియనుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కేంద్రానికి విన్నవించగా, సానుకూల స్పందన లభించింది.

Exit mobile version