Site icon NTV Telugu

DGP Shivadhar Reddy: రాష్ట్రంలో భారీగా పెరిగిన నమ్మక ద్రోహం కేసులు..

Dgp

Dgp

DGP Shivadhar Reddy: ఈ ఏడాది రాష్ట్రంలో క్రైమ్ తగ్గిందని.. మరోవైపు నమ్మక ద్రోహం కేసులు 23 శాతం పెరిగాయని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.. ఏడాది పూర్తవ్వడంతో తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు పంచుకున్నారు. వరకట్న కోసం మహిళల హత్యలు బాగా తగ్గాయని స్పష్టం చేశారు. వరకట్న వేధింపుల కేసులు 2 శాతం తగ్గాయి.. షీటీమ్‌లు చాలా యాక్టివ్‌గా పని చేస్తున్నాయని తెలిపారు.. ఎస్సీ, ఎస్టీ కేసులు 9.5 శాతం తగ్గాయి.. సైబర్‌ క్రైమ్‌ కేసుల్లో రికవరీ 23 శాతం పెరిగిందని వెల్లడించారు.. ఈ ఏడాది రూ.246 కోట్లను రికవరీ చేశాం.. 25500 మందికి రూ.150 కోట్లను రిఫండ్‌ చేసినట్లు చెప్పారు. 371 మంది సైబర్‌ క్రైమ్‌ నిందితులను అరెస్ట్‌ చేశామని.. ఒక్క నిమిషం జీవితాన్ని మారుస్తుంది అనే థీమ్‌తో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ని నిర్వహించబోతున్నామన్నారు.. మహిళల భద్రతపై షార్ట్‌ ఫిల్మిం తయారు చేసిన వారికి అవార్డులు ఇస్తామని ప్రకటించారు.. ఈ ఏడాది చైల్డ్ ట్రాఫికింగ్ లో 481 కేసులు నమోదు కాగ, 959 మంది బాధితులను కాపాడామని, 1277 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ లో ఈ ఏడాది తెలంగాణ మొదటి స్థానాన్ని పొందిందని తెలిపారు.

READ MORE: Aadhaar PAN Link: ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది.. SMS ద్వారా ఆధార్‌ను పాన్ నంబర్‌తో ఎలా లింక్ చేయాలంటే..?

ఈ ఏడాది12,396 మంది చిన్నారులను రెస్క్యూ చేశామని.. ఫింగర్ ప్రింట్స్ సిబ్బంది పనితీరు మూలంగా 600కు పైగా కేసులను ఛేదించామని డీజీపీ వెల్లడించారు. “ఏడాది కొత్తగా హైడ్రా పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేశాం. సీసీఎస్ రాజేంద్రనగర్, సిసిఎస్ మేడ్చల్ జోన్ లను పూర్తిస్థాయి పోలీస్ స్టేషన్లుగా ప్రకటించాం. ఈ ఏడాది లా అండ్ ఆర్డర్ కు సంబంధించి నారాయణపేట జిల్లాలో రెండు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒకటి ఏర్పాటు చేశాం. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు సంబంధించి నాగర్ కర్నూల్ 2 కల్వకుర్తిలో ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశాం. ఏడాది మొత్తం 2,28,695 కేసులు నమోదయ్యాయి.. శిక్షల రేటు 38.27 ఉంది..గతేడాది 35.63 శాతం ఉంది.. 216 కేసుల్లో 320 మందికి జీవిత ఖైదు పడింది.. ఫోక్సో కేసులో ముగ్గురికి ఉరిశిక్ష పడింది.. రోడ్డు యాక్సిడెంట్లు ఈ ఏడాది పెరిగాయి కానీ రోడ్డు యాక్సిడెంట్లలో చనిపోయిన వారి సంఖ్య తగ్గింది.. ఏడాది మొత్తం 6499 మంది రోడ్డు యాక్సిడెంట్లు కారణంగా ప్రాణాలు కోల్పోయారు.. ఏడాది జీరో ఎఫైర్లు రాష్ట్ర వ్యాప్తంగా 1251 నమోదయ్యాయి.. హత్య కేసులో ఈ ఏడాది 8.76% తగ్గాయి.. అత్యాచార కేసులు కూడా 13.45% తగ్గాయి.. ఈ ఏడాది ఎన్ డి పి ఎస్ యాక్ట్ కింద 2542 కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే 30 శాతం పెరిగాయి.. మహిళలపై నేరాల సంఖ్య గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 9.53% తగ్గాయి.. నవంబర్‌లో రాయపూర్ లో జరిగిన డీజీ అండ్ ఐజీ సదస్సులో శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ ఏడవ స్థానంలో నిలిచింది. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ లోనూ సిబ్బందికి అవార్డు వచ్చింది.. సైబర్ క్రైమ్ రాష్ట్రంలో మూడు శాతం తగ్గింది.. దేశవ్యాప్తంగా మాత్రం 41 శాతం సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయి.. ఆర్థిక నేరాలు ఆరు శాతం తగ్గాయి.. తెలంగాణలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 2.33% క్రైమ్ రేట్ తగ్గింది.. ఏడాది రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి.. ఫ్యూచర్ సిటీలోని అంతర్జాతీయ సమ్మిట్ విజయవంతంగా పూర్తయింది.. అంతర్జాతీయ ఫుట్బాల్ ఆటగాడు మెస్సి ప్రోగ్రాం కూడా విజయవంతంగా సాగింది.. మూడు విడతలుగా జరిగిన గ్రామపంచాయతీ ఎలక్షన్లు కూడా ప్రశాంతంగా సాగాయి .. నిష్పక్షపాతంగా ఈ ఎలక్షన్లలను జరిపాం” అని డీజీపీ శివధర్ రెడ్డి వివరించారు.

 

Exit mobile version