Telangana Cotton Millers Strike: తెలంగాణ రాష్ట్ర కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్ కానున్నాయి.. తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ నేటి నుంచి పత్తి కొనుగోళ్లను నిరవదికంగా నిలిపేసింది. L1,L2,L3 సమస్యను పరిష్కరించాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. రెండు దఫాలుగా ప్రభుత్వానికి అసోసియేషన్ ద్వారా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని సమ్మె నిర్వహిస్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా నిరవధికంగా కొనుగోళ్లు నిలిపివేయడంతో వ్యవసాయ మార్కెట్లో ఎక్కడికక్కడే పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. జిన్నింగ్ మిల్లుల( సీసీఐ కొనుగోలు కేంద్రాలు)లో సైతం కొనుగోళ్లు నిలిపేశారు.
READ MORE: IND vs PAK: టోర్నీలో తొలి పరాజయం.. పాక్ చేతిలో టీమిండియా ఓటమి..!
కాగా.. మరోవైపు.. భారీ వర్షాలతో దెబ్బతిన్న పత్తి పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాదేమోనన్న బెంగతో.. మనస్తాపానికి గురైన ఓ యువరైతు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెబ్బెన ఎస్సై వెంకటకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన ముంజం రామయ్య, లక్ష్మీబాయి దంపతుల రెండో కుమారుడు సంతోష్(30), మూడో కుమారుడు కలిసి 10 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటకు నష్టం వాటిల్లింది. ఈ దిగులుతో సంతోష్ పురుగు మందు తాగారు. అనంతరం తన తల్లికి విషయం చెప్పగా.. హుటాహుటిన బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.
