Telangana Cold Wave: రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని వస్త్రాలు కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చలి పులి బేంబెలెత్తిస్తోంది. రెండు మూడు రోజుల నుంచి చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లా సహా పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోనూ చలి తీవ్రత అంతకంతకూ పెరిగింది. 11 నుంచి 12 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని వస్త్రాలు వినియోగిస్తూ జనం ఉపశమనం పొందుతున్నారు. చలి తీవ్రత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వణికిపోతోంది. తాజాగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోవటంతో జనం గజగజ వణకాల్సి వస్తోంది.
READ MORE: Astrology: నవంబర్ 17, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారు శుభవార్త వింటారు..!
తెలంగాణ వెదర్ మ్యాన్ వివరాల ప్రకారం.. ఇన్ని రోజులు మనం తీవ్రమైన చలిని చూశాం.. కానీ రాబోయే 2 రోజుల్లో చలి మరింత పెరుగుతుంది. రాబోయే 48 గంటల్లో మొత్తం తెలంగాణ అంతటా చలి తీవ్రత అధికంగా ఉంటుంది. రేపు ఉదయం నాటికి, పశ్చిమ, ఉత్తర టాంజానియాలో ఉష్ణోగ్రతలు 6-9°C వరకు, హైదరాబాద్‌లో 7-11°C వరకు తగ్గుతాయి.
READ MORE: Bihar: నేడు మంత్రి వర్గం రద్దు.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే..?
