Night temperatures Falling Down in Telangana: తెలంగాణలో చలి పంజా విసురుతోంది. ఈశాన్యం నుంచి గాలులు వీస్తుండటంతో.. గత పది రోజులుగా రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. శనివారం రాత్రి పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలలో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సిర్పూర్‌లో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు సొనాలలో 8.5 ఉష్ణోగ్రతలు నమోదు. బేల 9.2, బజార్ హత్నూర్‌లో 9.3, పొచ్చెరలో 9.5, పెంబిలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రాబోయే 2-3 రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర, ఈశాన్యం నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు. చలికి తోడు పొగ మంచు భారీగా పేరుకుపోయింది. ఉదయం 9 గంటల వరకు మంచు వీడటం లేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సగటు పగటి ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీల మధ్య నమోదవుతోంది.
Also Read: MMTS Trains Cancelled: హైదరాబాద్ ప్రయాణికులకు అలెర్ట్.. 29 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు!
ఆదివారం సంగారెడ్డిని భారీగా మంచి కమ్మేసింది. నాందేడ్-అఖోల నేషనల్ హైవే 161ని పొగమంచు పూర్తిగా కమ్మేసింది. ఉదయం 10 దాటినా.. రోడ్డుపై పొగమంచు దట్టంగా కమ్ముకుంది. హైవేపై కనుచూపు మేరలో వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారు. కొందరు తప్పనిసరి పరిస్థితిలో లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళుతున్నారు.