NTV Telugu Site icon

CM KCR: కేంద్రంపై పోరాటం.. జాతీయ నేతలకు కేసీఆర్‌ ఫోన్లు..

ఏ అవకాశం దొరకినా.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వంపై ఓరేంజ్‌లో విరుచుకుపడుతున్నారు తెలంగాణ సీఎం, గులాబీపార్టీ దళపతి కె.చంద్రశేఖర్‌రావు.. ఈ మధ్య మీరు గోకకున్నా.. నేను గోకుతూనే ఉంటానంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, విధానాలను ఎండగడుతూ హాట్ కామెంట్లు చేస్తూ వస్తున్న కేసీఆర్.. ఇప్పుడు మరోసారి కేంద్రంపై యుద్ధం ప్రకటించారు.. దానికి పార్లమెంట్‌ను వేదికగా చేసుకోబోతున్నారు.. తమ ఎంపీలను ఈ పోరాటంలో భాగస్వాములను చేస్తూనే.. ఇతర పార్టీల మద్దతుతో కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధం అవుతున్నారు.. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. జాతీయ నేతకు ఫోన్‌ చేసి దీనిపై చర్చించారు సీఎం కేసీఆర్.

Read Also: Parliamentary Meeting: ఎవరి వ్యూహాలు వారివి.. ఇటు బీజేపీ, అటు బీజేపీ మీటింగ్

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ , బీహార్ ఆర్జెడీ నేత తేజస్వీయాదవ్, యుపీ ప్రతిపక్షనేత అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ నేత శరద్ పవార్ సహా ఇతర జాతీయ విపక్ష నేతలతో ఫోన్లో మాట్లాడారు కేసీఆర్.. కేంద్రం అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరిపై సమరశంఖం పూరిద్దామని పిలుపునిచ్చారు.. ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోన్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వంపై పోరాటం చేద్దామని కోరారు.. దీని కోసం పార్లమెంట్‌ సమావేశాలను వేదికగా చేసుకుందామని సూచించారు. కాగా, ప్రభుత్వ పథకాల నుంచి ప్రధాని మోడీ కామెంట్ల వరకు, బీజేపీ నేతల స్టేట్‌మెంట్లు ఇలా ఏవీ వదలకుండా.. అన్నింటినీ టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు కేసీఆర్.. ఇంటా బయట అనే విధంగా.. పార్లమెంట్‌లోనూ బయట ఇలా అన్ని వేదికల నుంచి కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు.