NTV Telugu Site icon

Asia Elite Boxing Championship: ఆసియా బాక్సింగ్‌లో పతకం సాధించిన తెలంగాణ బాక్సర్‌

Telangana Boxer Hussamuddin

Telangana Boxer Hussamuddin

Asia Elite Boxing Championship: ఏషియన్ ఎలైట్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్‌ హుసాముద్దీన్‌ కాంస్య పతకం సాధించాడు. జోర్డాన్‌లో జరుగుతున్న ఆసియా ఎలైట్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో పురుషుల 57 కిలోల విభాగంలో సెమీ ఫైనల్‌ చేరడం ద్వారా అతను ఈ పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. క్వార్టర్‌ ఫైనల్‌లో హుసాముద్దీన్‌ కుడి కంటి పైభాగంలో గాయమైంది. దాంతో అతను సెమీఫైనల్‌కు గైర్హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థికి వాకోవర్ ఇచ్చేశాడు. ఇక కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఈ టోర్నీలో భారత్‌ నుంచి ఆరుగురు బాక్సర్లు ఫైనల్‌కు దూసుకెళ్లడం గమనార్హం.

Sunill Gavaskar: ఇక సీనియర్ల రిటైర్మెంట్లు ఉండొచ్చు.. హార్దిక్‌కు కెప్టెన్సీ!

మిగతా బౌట్లలో స్టార్‌ బాక్సర్‌ శివ తాపా(63.5కి) 4-1 తేడాతో బక్దౌర్‌ ఉస్మనోవ్‌పై గెలిచి పసిడి పోరులో నిలిచాడు. పురుషుల 63.5 కిలోల విభాగంలో పోటీ పడుతున్న స్టార్ బాక్సర్ శివ థాపా రికార్డు స్థాయిలో ఆరో పతకం ఖాయం చేసుకున్నాడు. ఆది నుంచే దూకుడు కనబరిచిన శివ ప్రత్యర్థికి ఎక్కడా అవకాశమివ్వకుండా పంచ్‌లతో విరుచుకుపడ్డాడు. ఫైనల్లో ఉజ్బెకిస్థాన్‌ బాక్సర్‌ అబ్దుల్లా రుస్లాన్‌తో శివ తలపడనున్నాడు. గోవింద్‌కుమార్‌ సహానీ (48కి), సుమిత్‌ (75కి), నరేందర్‌(92కి) ప్రత్యర్థుల చేతుల్లో ఓటములతో కాంస్య పతకాలకు పరిమితమయ్యారు. శుక్రవారం ఐదుగురు మహిళా బాక్సర్లు మీనాక్షి, పర్వీన్‌, లవ్లీనా, సవీటి, అల్ఫియా ఫైనల్‌ బౌట్లలో తలపడుతారు.