Telangana Bandh: అసలే పండగ. మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో వలస వచ్చిన కార్మికులతో పాటు విద్యార్థులు పెట్టేబేడ సర్దుకుని సొంత స్థలాలకు పయణమయ్యారు. కానీ.. బస్టాండ్‌లకు చేరుకోగానే బస్సులు బంద్ అని తెలిసి అసహనం వ్యక్తం చేశారు. కొందరికి ముందే బంద్ అని తెలిసి ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఎలాగైతేనేం.. అందరికీ తమ తమ సొంత వాహనాలు ఉండవు.. బస్సులు రోడెక్కే పరిస్థితి లేదు. ప్రైవేటు వాహనాలే దిక్కయ్యాయి. మరోవైపు.. ప్రైవేటు క్యాబ్స్ ఓనర్స్‌కి ఇదే మంచి సమయం అనుకున్నారు. ప్రయాణికులను దోపిడీ చేస్తున్నారు. ఏకంగా రెండింతల ఛార్జీలు వసూలు చేస్తున్నారు. రెండ్రోజులైనా ఇంట్లో సుఖంగా ఉందామని బయలుదేరిన ప్రయాణికులు ఆ ఛార్జీలు చూసి లబోదిబోమంటున్నారు.. ఎల్బీ నగర్ నుంచి సూర్యాపేటకు మామూలు రోజుల్లో రూ.200 తీసుకుంటారు.. కానీ ప్రస్తుతం రూ.800 డిమాండ్ చేస్తున్నారు ప్రైవేట్ కార్ల డ్రైవర్లు.. విజయవాడ వెళ్లాలంటే ఒక్కొక్కరికి రూ.2 వేలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు.
READ MORE: Delhis Railway Station: రణరంగంగా ఢిల్లీ రైల్వేస్టేషన్.. డబ్ల్యూడబ్ల్యూఈ తరహాలో ఫైటింగ్
మరోవైపు.. తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. నేడు(శనివారం) బీసీ వర్గాల హక్కుల సాధన కోసం, 42 శాతం రిజర్వేషన్ల చట్టబద్ధత డిమాండ్‌తో రాష్ట్ర బంద్‌కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో అన్ని విద్యాసంస్థలు సెలవును ప్రకటించాయి. మరునాడు అక్టోబర్ 19 ఆదివారం కావడంతో అది వారపు సెలవు. ఆ మరుసటి రోజు, అంటే అక్టోబర్ 20 దీపావళి సెలవు. ఈ విధంగా సండే కలిసిరావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు లభించాయి. పాఠశాలలు, కళాశాలలు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడతాయి. పండగ వేళ వరుస సెలవులు రావడంతో విద్యార్థులు ఎగిరిగంతేస్తున్నారు.
READ MORE: Harivansh Narayan Singh: ఎన్నికల వేళ ప్రశాంత్ కిషోర్‌పై రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ప్రశంసలు
