Site icon NTV Telugu

Telangana Assembly Session 2024 Live Updates: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయంపై సభలో చర్చ.

Ts Assembly Live Updates

Ts Assembly Live Updates

నేడు రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదట సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెబుతారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రంకు జరిగిన అన్యాయంపై చర్చ చేపట్టాలని స్పీకర్‌ను ప్రభుత్వం కోరనుంది. షార్ట్ డిస్కషన్ కింద స్పీకర్ అనుమతి ఇస్తే.. కేంద్ర బడ్జెట్‌పై సభలో​ చర్చ జరగనుంది. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం సభలో తీర్మానం చేయనుంది. హైదరాబాద్ అభివృద్ధిపై స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశం ఉంది.

 

The liveblog has ended.
  • 24 Jul 2024 05:20 PM (IST)

    తెలంగాణపై వివక్ష కాదు, కచ్చితంగా కక్ష-సీఎం రేవంత్

    తెలంగాణ అభివృద్ధి జరగాలని ఏపీ విభజన చట్టంలో పొందుపర్చారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టం చేశారు. గడిచిన పదేళ్లు ఆ చట్టాలను అమలు చేయలేదు. గత ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయలేదు. మేం అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఢిల్లీ వెళ్లాం. ప్రధానిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను ప్రస్తావించాం. పెద్దన్న పాత్ర పోషించాలని మోడీని కోరాను. మోడీని పెద్దన్న అని కీర్తిస్తే నాకు వచ్చేది ఏముంది.? రాష్ట్రాలకు పెద్దన్నలాగా వ్యవహరించాలని కోరాను. ఎవరి దగ్గర వంగిపోవడమో, లొంగిపోవడమో చేయలేదు. తెలంగాణపై వివక్ష కాదు, కచ్చితంగా కక్ష. కొందరు త్యాగాలు చేశామని చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే కాకముందే మంత్రిని చేసింది కాంగ్రెస్‌ కాదా.? పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ రూపాయి చెల్లిస్తే 45 పైసలు కూడా తిరిగి ఇస్తలేదు. అదే బీహార్‌ రూపాయి చెల్లిస్తే, కేంద్రం తిరిగి రూ.7 ఇస్తోంది. గుజరాత్‌లో మోడీ తన ఎస్టేట్‌లు అమ్మి మనకు ఏమైనా ఇచ్చారా.? తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.3.67 లక్షల కోట్లు వెళ్లాయి. కేంద్రం నుంచి వచ్చింది రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే. ఐదు దక్షిణాది రాష్ట్రాలు రూ. 22.66 లక్షల కోట్ల పన్ను చెల్లించాయి. పదేళ్లలో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చింది కేవలం రూ.6లక్షల కోట్లు. యూపీ రూ.3.47లక్షల కోట్లు పన్ను చెల్లిస్తే, అక్కడ కేంద్రం రూ.6.91 లక్షల కోట్లు ఖర్చు చేసింది. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తుంది. ఈనెల 27న జరగబోయే నీతి ఆయోగ్ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం. పార్లమెంట్‌లో ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలి. తీర్మానానికి సభ ఆమోదం.

  • 24 Jul 2024 05:07 PM (IST)

    కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీ తీర్మానం

    కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీ తీర్మానం. తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం రేవంత్‌. సభ్యులకు తీర్మాన పత్రాలు అందజేత.

  • 24 Jul 2024 05:02 PM (IST)

    బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదు - మంత్రి శ్రీధర్ బాబు

    ఇండస్ట్రియల్ కారిడార్ లో హైదరాబాద్ పేరు ఉంది. వాళ్ల నోడ్ లో ఇప్పుడు ఏపీలో ఉంది. ఏపీకి పునర్విభజన చట్టంలో భాగంగా నిధులు ఇస్తే మాకు అభ్యంతరం లేదు. కానీ తమ ప్రభుత్వంలో భాగస్వాములు గా ఉన్నారు అందుకే వాళ్లకు నిధులు ఇస్తామనేది కరెక్ట్ కాదు. ఎందుకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణను చిన్న చూపు చూస్తుంది. ఉరుముదయ పథకంలో ఏపీకి,బీహార్ కి న్యాయం చేస్తామనడం కరెక్ట్ కాదు. నీటి ప్రాజెక్టులో తెలంగాణకు నిధులు ఇవ్వాలని కోరితే ఆ ప్రస్తావని చేయలేదు. బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదు. ప్రపంచ స్థాయిలో పేరొందిన టూరిజం ప్రాంతాలు తెలంగాణలో ఉన్నవి. వాటి ప్రస్తావనే లేదు. ఎన్డీయే గవర్నమెంట్ లో నీతి ఆయోగ్ ప్రవేశపెట్టి ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించి విధులు, నిధులు హక్కులని తుంగలో తొక్కుతుంది. 14వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులని అనేకసార్లుగా రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది. కానీ దాన్ని కూడా పక్కన పెట్టడం జరిగింది. ఆర్టికల్ 275 ని కూడా పట్టించుకోలేదు. ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణని ముందుకు తీసుకపోకపోతే వికసిత్ భారత్ కి సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్రంలో అనేక వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి.

  • 24 Jul 2024 04:51 PM (IST)

    నా అభిప్రాయం సీఎం చెప్పారు. -స్పీకర్ గడ్డం ప్రసాద్‌

    సీఎం చెప్పిన దాంట్లో తప్పులేదు. సభకు ప్రతిపక్షనాయకుడు వస్తే బాగుంటుంది. నా అభిప్రాయం సీఎం చెప్పారు. -స్పీకర్ గడ్డం ప్రసాద్‌

  • 24 Jul 2024 04:39 PM (IST)

    ఢిల్లీలో మంత్రులు ఆమరణ దీక్ష చేయాలన్న కేటీఆర్‌ వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌ కౌంటర్‌

    చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించామని మేము ఎప్పుడూ చెప్పలేదు. మేము ఎవరి శవాలపై రాజకీయాలు చేయలేదు. కేసీఆర్‌ను ఢిల్లీకి రమ్మని చెప్పండి. నేను కూడా దీక్షలో కూర్చుంటా. ఇద్దరం సచ్చుడో, నిధులు తెచ్చుడో చూద్దాం. రూ.వంద పెట్టి పెట్రోల్‌ కొన్న ఆయనకు అగ్గిపెట్టకు పైసలు లేవా.? -సీఎం రేవంత్‌

  • 24 Jul 2024 04:32 PM (IST)

    సభా నాయకుడిని అనుభవం లేదని కేటీఆర్‌ మాట్లాడటం సరికాదు

    సీఎం కూడా సీనియర్‌ సభ్యుడు. ఆయనకు సభా వ్యవహారాలు తెలుసు. సభా నాయకుడిని అనుభవం లేదని కేటీఆర్‌ మాట్లాడటం సరికాదు. బీజేపీకి కోపం వస్తుందని కేటీఆర్‌ విషయాన్ని వదలేసి అన్నీ మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే బీఆర్ఎస్‌ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం. మూసీ, మెట్రోకు నిధులు ఇవ్వలేదు. మేము అడుగుతున్నవి హక్కుగా రావాల్సినవే. మేం బీజేపీతో కలవడమేంటి.? -భట్టి

  • 24 Jul 2024 04:01 PM (IST)

    మోడీ ప్రేమలో అమరులం అవుతామని నాడు కేసీఆర్‌ అనలేదా.?

    మోడీ ప్రేమలో అమరులం అవుతామని నాడు కేసీఆర్‌ అనలేదా.? మీ ప్రేమ, ఆశీర్వాదం ఉంటే చాలు. వేల కోట్లు డబ్బులు అక్కర్లేదన్న మాట వాస్తవం కాదా.? పార్లమెంట్‌ మెట్ల దగ్గర మా ఎంపీలు ధర్నాలు చేస్తు్న్నారు. మరి మీ ఎంపీలు ఎక్కడున్నారు. విలీనం కోసం ఇళ్లిల్లు తిరుగుతోంది బీఆర్ఎస్‌ సభ్యులు కాదా.? 370 యాక్ట్‌ రద్దు, ట్రిపుల్‌ తలాక్‌ విషయంలో మోడీ సర్కార్‌కు బీఆర్‌ఎస్‌ ఎంపీలు మద్దతివ్వలేదా.? -సీఎం రేవంత్ రెడ్డి

  • 24 Jul 2024 03:40 PM (IST)

    తెలంగాణ అంటే మొదట్నింటి ప్రధాని మోడీకి చిన్నచూపు.

    తెలంగాణ అంటే మొదట్నింటి ప్రధాని మోడీకి చిన్నచూపు. తెలంగాణ ఏర్పాటును మోడీ ఎన్నోసార్లు అవమానించారు. కేంద్రమంత్రులు హైదరాబాద్‌కు ఏం తెచ్చారు.? వంద సీట్లలో డిపాజిట్‌ రాని బీజేపీ నేతలు కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారు. బడ్జెట్‌లో జరిగిన అన్యాయంపై బీజేపీ నేతలు మాట్లాడరా.? సుష్మా స్వరాజ్‌ను చిన్మమ్మ అని పిలుచుకుంటున్నాం. తెలంగాణ, భారత్‌లో భాగం కాదా.? కేంద్రంలో కుర్చీ కాపాడుకోడానికే ఏపీ, బీహార్‌కు నిధులు. సిరిసిల్లలో ఆత్మహత్యలు జరుగుతుంటే కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఏం చేస్తున్నారు.? -మంత్రి పొన్నం

  • 24 Jul 2024 02:22 PM (IST)

    గతంలో మోడీకి కేసీఆర్‌ ఊడిగం చేశారు.

    గతంలో మోడీకి కేసీఆర్‌ ఊడిగం చేశారు. జీఎస్టీ బిల్లు తీసుకొచ్చినప్పుడు బీఆర్ఎస్‌ మద్దతు పలికింది. కేంద్రానికి కోపం వస్తుందని కేటీఆర్‌ పదే పదే ఆవు కథ చెబుతున్నారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి జీఎస్టీకి కేసీఆర్‌ మద్దతు తెలిపారు. ప్రత్యేక విమానంలో వెళ్లి బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు జీఎస్టీకి మద్దతుగా ఓటేశాడు. నోట్ల రద్దును స్వాగతిస్తున్నట్లు కేసీఆర్‌ చెప్పారు. 370 ఆర్టికల్‌ రద్దు, ట్రిపుల్‌ తలాక్‌కు కూడా బీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చింది. అదానీ, అంబానీలతో కుమ్మక్కయ్యే అవసరం మాకు లేదు. -సీఎం రేవంత్‌

  • 24 Jul 2024 02:01 PM (IST)

    రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం : భట్టి

    రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. సింగరేణిపై తప్పుడు ప్రచారం సరికాదు. సింగరేణిని ప్రైవేట్‌ పరం చేస్తామని ఎవరన్నారు. సింగరేణికి నష్టం చేసింది మీరే. మా వల్ల ఎంత లాభం జరిగిందో చర్చిద్దాం. అడ్డగోలుగా మాట్లాడితే ఎలా..?- భట్టి విక్రమార్క

  • 24 Jul 2024 01:29 PM (IST)

    వివాదాల వైపు చర్చలొద్దు. -సీఎం రేవంత్‌ రెడ్డి

    కేసీఆర్‌ కుటుంబం మొత్తం సభను తప్పుదోవ పట్టిస్తోంది. మొన్న ఢిల్లీకి వెళ్లి చీకట్లో మాట్లాడుకుని వచ్చిందే మీ అభిప్రాయమా.? చీకటి ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. స్వయం కృషితో సభలోకి వచ్చా. తండ్రిపేరు చెప్పుకుని రాలేదు.. వివాదాల వైపు చర్చలొద్దు. -సీఎం రేవంత్‌ రెడ్డి

  • 24 Jul 2024 01:16 PM (IST)

    మేము ప్రజాస్వామ్య బద్ధంగా వెళ్తున్నాం

    మేము ప్రజాస్వామ్య బద్ధంగా వెళ్తున్నాం. అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకు వెళ్తామంటే ఎందుకు వద్దంటున్నారు. -మంత్రి శ్రీధర్‌బాబు

  • 24 Jul 2024 01:02 PM (IST)

    చర్చకు కేసీఆర్‌ అవసరం లేదు.. మేము చాలు. -కేటీఆర్‌

    మాకు తీర్మానం కాపీ ఇవ్వలేదు. చర్చకు కేసీఆర్‌ అవసరం లేదు.. మేము చాలు. -కేటీఆర్‌

  • 24 Jul 2024 12:51 PM (IST)

    కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయంపై సభలో చర్చ.

    కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. తెలంగాణలో వెనుకబడ్డ జిల్లాలను కేంద్రం పట్టించుకోలేదు. మా విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదు. ఏపీకి కేంద్రం ఏమిచ్చినా మాకు అభ్యంతరం లేదు. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోంది. -మంత్రి శ్రీధర్‌బాబు

  • 24 Jul 2024 12:22 PM (IST)

    కేసీఆర్‌ సభకు ఎందుకు రాలేదు.

    కేసీఆర్‌ సభకు ఎందుకు రాలేదు. కేంద్రాన్ని నిలదీయాల్సిన సమయంలో సభకు ఎందుకు రాలేదు. మోడీ చూస్తే ఏమైనా అవుతుందేమో అని భయపడ్డారు. -సీఎం రేవంత్‌ రెడ్డి

  • 24 Jul 2024 12:00 PM (IST)

    మీడియా పాయింట్‌ వద్ద హరీష్‌ రావు

    ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పారిపోయింది. రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని గమనిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం. ఆర్టీసీ యూనియన్ ను పునరుద్ధరణ చేయడం లాంటి సమస్యలపై ప్రభుత్వం ఇప్పటి వరకు కార్యాచరణ చేపట్టలేదు. సీఎం హాఫ్ నాలెడ్జీ తో మాట్లాడుతున్నారు. ఆయనకు ఎవరు సలహాలు ఇస్తున్నారో నేను రాష్ట్ర మంత్రి అయిన తర్వాత ఆర్టీసీ యూనియన్ గౌరవ అధ్యక్షుడుగా రాజీనామా చేశాను.

  • 24 Jul 2024 11:57 AM (IST)

    బీఆర్ఎస్ వాకౌట్

    బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

  • 24 Jul 2024 11:29 AM (IST)

    వాయిదా తీర్మానాలు తిరస్కరించిన స్పీకర్

    బీజేపీ..బీఆర్ఎస్ ల వాయిదా తీర్మానాలు తిరస్కరించిన స్పీకర్

  • 24 Jul 2024 11:16 AM (IST)

    ఆర్టీసీపై తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం

     

    హరీష్‌ రావు 2014 నుంచి మంత్రిగా పనిచేస్తున్నారు. స్పీకర్‌ మీద ఆరోపణలు చేయడం తగదు. కార్మికులు కష్టాల్లో ఉన్నప్పుడు, సమ్మె చేస్తున్నప్పుడు వివక్ష చూశాం. కార్మికుల పక్షాన కొట్లాడే కమ్యూనిస్టులను మైక్‌ ఇస్తే తప్పేంటి.? సాంబశివరావుకి మైక్‌ ఇవ్వడం తప్పా? గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కార్మిక సంఘాన్ని రద్దు చేసింది. ఆనాడు ఆర్టీసీ గౌరవ అధ్యక్షుడు హరీష్‌రావే. -సీఎం రేవంత్‌ రెడ్డి

  • 24 Jul 2024 11:12 AM (IST)

    రూ.280 కోట్ల బకాయిలను మా ప్రభుత్వం చెల్లించింది. -మంత్రి పొన్నం

    ఆర్టీసీ ఆస్తులను బీఆర్‌ఎస్‌ నేతలకు అప్పనంగా దోచిపెట్టారు. ఆర్టీసీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు. రూ.280 కోట్ల బకాయిలను మా ప్రభుత్వం చెల్లించింది. -మంత్రి పొన్నం

  • 24 Jul 2024 10:56 AM (IST)

    ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తున్నాం. -మంత్రి పొన్నం

    10 ఏళ్లుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్టీసీని చంపేసింది. కార్మిక సంఘాలను రద్దు చేయాలన్నవారే యూనియన్లను పునరుద్ధరించాలని అంటున్నారు. హరీష్‌ వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. 50 రోజులు కార్మికులు సమ్మె చేస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తున్నాం. -మంత్రి పొన్నం

  • 24 Jul 2024 10:40 AM (IST)

    మహాలక్ష్మీ నిధులు ఆర్టీసీకి ఇవ్వడం లేదు. -హరీష్‌ రావు

    ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు. మహాలక్ష్మీ నిధులు ఆర్టీసీకి ఇవ్వడం లేదు. -హరీష్‌ రావు

  • 24 Jul 2024 10:15 AM (IST)

    తెలంగాణలో చాలా తండాలకు రోడ్డుమార్గం లేదు-సీఎం రేవంత్

    తెలంగాణలో చాలా తండాలకు రోడ్డుమార్గం లేదు. తండాలకు 100 శాతం బీటీ రోడ్లు వేయాలని నిర్ణయించాం. గత ప్రభుత్వంలో చాలా గ్రామాలకు నీరు ఇవ్వలేదు. తండాలు, గూడాల్లో అభివృద్ధి జరిగితేనే అసలైన అభివృద్ధి జరిగినట్లు. చేసిన తప్పులకు శిక్షపడ్డా ఇంకా మారడం లేదు. -సీఎం రేవంత్‌ రెడ్డి

Exit mobile version