ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఇటీవలే ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.. ఆ సినిమా మిశ్రమ టాక్ ను అందుకున్నా కూడా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది.. ఇప్పటికి కలెక్షన్ల వర్షం కురుస్తుంది.. రామాయణం ఆధారంగా తెరకేక్కిన ఈ సినిమా విజువల్ వండర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది.. శూర్పణఖ పాత్రను మర్చిపోలేకపోతున్నారు. ఇంతకీ ఆమె ఎవరు..? ఈ సినిమాలో అందాల రాక్షసి శూర్పణఖ గురించి యూత్ తెగ వెతికేస్తున్నారు…
ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆదిపురుష్ మ్యానియా పట్టుకుంది. ఓం రౌంత్ దర్శకత్వంలో ప్రభాస్, సైఫ్ అలీఖాన్, కృతి సనన్ నటించిన ఆదిపురుష్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈసినిమా సినీ ప్రేమికులను అలరిస్తోంది. అంతే కాదు ఈ సినిమాలో ప్రతీ పాత్ర అందరిని ఆకర్షిస్తొంది.. రామాయణంలో కథను మలుపుతిప్పిన పాత్రల్లో ముఖ్యమైన పాత్ర రావణాసుడి చెల్లెలు శూర్పణఖ. ఆమె రామున్ని మోహించబడ్డే.. లక్ష్మణుడితో పరాభవం జరగడం.. ఆతరువాత రావణాసురుడు సీతన అపహరించడం జరిగిపోయింది.ఆ సమయంలో రాముడి సోదరుడు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కును కత్తిరిస్తాడు. ఈ పాత్రను ఆదిపురుష్ మూవీలో అద్భుతంగా చూపించారు..
శూర్పణఖ పాత్రలో నటించింది తేజస్విని పండిట్. ఆదిపురుష్ మూవీ ఎంతో క్రూరంగా కనిపించిన తేజస్విని పండిట్ రియల్ లైఫ్ లో స్టార్ హీరోయిన్. మరాఠా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతుంది. పాపులర్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2004 లో వచ్చిన అగా బాయి అరేచా అనేమరాఠా మూవీతో కెరీర్ స్టార్ట్ చేసింది బ్యూటీ.. ఈమె అందం వెనుక విషాదం ఉందని కొన్ని వార్తలు నెట్టింట ప్రచారంలో ఉన్నాయి..తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజేస్విని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
ఆదిపురుష్ లో నటించడం చాలా ఆనందాన్ని కలిగించిందని ఆమె తెలిపింది. ఇప్పుడు నా గురించి నెటిజన్స్ గూగుల్ లో సర్చ్ చేస్తుంటే సంతోషంగా ఉంది అని అన్నారు. అలాగే తన చిన్న తనంలో ఎదుర్కొన్న కష్టాలు గురించి కూడా తెలిపారు తేజేస్విని. ఒకానొక సమయంలో తినడానికి తిండి కూడా లేదని ఆమె ఎమోషనల్ అయ్యారు. కనీసం ఇంట్లో కరెంట్ కూడా ఉండేది కాదని.. అప్పులు మాత్రం చాలా ఉండేవి అని తెలిపారు. వాటన్నింటిని తలుచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు వస్తాయని అన్నారు. అలాగే తన స్కూల్ స్నేహితుడిని 2012లో పెళ్ళాడనని కానీ కొన్ని కారణాల వల్ల విడిపోయామని తెలిపింది తేజేస్విని పండిట్.. ఇప్పుడు ఒంటరిగా ఉంటూ సినిమాలు చేస్తుంది.. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా తెగ ట్రెండ్ అవుతుంది..
