తేజస్వి మదివాడా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బోల్డ్ బ్యూటీగా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ఎప్పుడు హాట్ యాంగిల్స్ లో బట్టలను పొదుపు చేస్తూ ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. కానీ ఇప్పుడు ఫుల్ చుడిదార్ లో ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
బ్లాక్ కలర్ చుడిదార్ లో ట్రెడిషనల్ గా దర్శనమిచ్చింది. చెప్పాలంటే తేజస్వి హోమ్లీ లుక్ అద్భుతంగా ఉంది. దీంతో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బ్యూటిఫుల్, గార్జియస్ అంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు. తేజస్వి లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.. గతంలో వరుస సినిమాలు చేసి బాగా పాపులర్ అయిన ఈ అమ్మడు ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.. ఇక సోషల్ మీడియాలో అభిమానులను పలకరిస్తూ వచ్చిన ఈ అమ్మడు.. ఇటీవల బీబీ జోడీ షోలో సందడి చేశారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ జోడీలుగా ఏర్పడి ఈ డాన్స్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశారు. అఖిల్ సార్థక్-తేజస్వి జంటగా తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు.
అయితే ఫైనల్ కి వెళ్లలేకపోయారు. సూర్య-ఫైమా జోడీ టైటిల్ గెలిచి రూ. 25 లక్షలు సొంతం చేసుకున్నారు.. బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొన్న తేజస్వి పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే ఆమె కనీసం ఫైనల్ కి కూడా వెళ్ళలేదు.హౌస్లో అందాల ప్రదర్శన పైనే దృష్టి పెట్టిన తేజస్వి మాదివాడ 7వ వారం ఎలిమినేట్ అయ్యారు. ఆ సీజన్ విన్నర్ గా కౌశల్ నిలిచాడు.. ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు.. ప్రస్తుతం ఈ అమ్మడు వెబ్ సీరిస్ లలో బిజీగా ఉంది..