టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ఉన్న దర్శకుడు తేజ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఈసారి తన సొంత కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ కొత్త సినిమాను లాంచ్ చేశారు. తేజ కెరీర్‌లో ఇప్పటివరకు చాలా మంది కొత్తవారికి అవకాశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన కొడుకుకి డైరెక్టర్‌గా పరిచయం ఇవ్వడం గర్వకారణంగా మారింది. అయితే టాలీవుడ్‌లో స్టార్ కుటుంబాల వారసులు ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.. ఇందులో భాగంగా ఇప్పుడు ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసురాలు తెరంగేట్రం చేయనుంది.
Also Read : Rajinikanth : రజినీకాంత్ సినీ ప్రస్థానానికి 50 ఏళ్లు – అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ
అవును.. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఘట్టమనేని రమేష్ బాబు గారి కుమార్తె భారతి ఎంట్రీ ఇస్తున్నారు. రమేష్ బాబు కుటుంబం నుంచి మరొకరు సినీ రంగ ప్రవేశం చేయడం విశేషం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గతంలో రమేష్ బాబు కొడుకుని కూడా తేజే ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇప్పుడు రమేష్ బాబు కూతురుని కూడా తన సినిమాతో పరిచయం చేయబోతున్నాడు. కాగా ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో మంచి హైప్ క్రియేట్ అవుతోంది. తేజ తనదైన స్టైల్‌లో తెరకెక్కించే ఈ సినిమా, కొత్త హీరో-హీరోయిన్ కెరీర్ ప్రారంభానికి మంచి ప్లాట్‌ఫామ్‌గా మారుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
