flight emergency landing: విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఏర్పడిన షాకింగ్ ఘటన శనివారం కర్ణాటకలో వెలుగుచూసింది. బెల్గాం నుంచి ముంబై వెళ్తున్న ఓ విమానంలో ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఏర్పడినట్లు ఫైలట్ గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఆయన విమానాన్ని తిరిగి విమానాశ్రయంలో సేఫ్‌గా ల్యాండ్ చేసి 48 మంది ప్రాణాలను కాపాడారు.
READ MORE: NTV Telugu Podcast: నండూరి శ్రీనివాస్ తో ఎన్టీవీ స్పెషల్ పాడ్‌కాస్ట్..
అసలు ఏమైందంటే..
శనివారం ఉదయం బెల్గాం నుంచి ముంబైకి 7.50 గంటలకు స్టార్ ఏయిర్ విమానం బయలుదేరింది. బయలుదేరిన కొద్ది సమయంలోనే విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఉందని గుర్తించిన పైలట్ తిరిగి 8.50 గంటలకు విమానాశ్రయంలో విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేశారు. సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని నిలిపివేశారు. దీంతో ప్రయాణీకుల కోసం సదురు విమానయాన సంస్థ ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసింది. ఇంజిన్ వైఫల్యానికి గల కారణాన్ని ఎయిర్‌లైన్స్ పరిశీలిస్తోంది.
భయాందోళనలో విమాన ప్రయాణికులు..
ఇటీవలి కాలంలో తరుచుగా విమానాలలో సాంకేతిక సమస్యల కేసులు నమోదు కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురి అవుతున్నారు. గతంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో సుమారుగా 260 మంది మరణించారు. ఈ సంఘటన తర్వాత విమానాల భద్రతా ఏర్పాట్ల గురించి అనేక ప్రశ్నలు తలెత్తాయి. గతంలో విమానంలో ప్రయాణించడం సురక్షితమైనదని, తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకోవచ్చని భావించేవారు. కానీ ఇప్పుడు విమానంలో ప్రయాణించడం ద్వారా సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవడం చాలా పెద్ద విషయం అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో ఏర్పడిన ఈ అభిప్రాయాలను మార్చడం కోసం విమానయాన సంస్థలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
READ MORE: Medak: ముగ్గురు దోస్తుల మాస్టర్ ప్లాన్.. యూట్యూబ్‌లో చూసి ఏటీఎంల చోరీలు.. కట్‌చేస్తే..
