Site icon NTV Telugu

Bengaluru: ఇద్దరు పిల్లల తల్లి 25 ఏళ్ల యువకుడితో లవ్వు.. ప్రియురాలు దూరమవుతదేమోనని ఓయోకి పిలిచి..

Bengaluru Crime

Bengaluru Crime

సోషల్ మీడియా ప్రభావమో.. పరాయి వ్యక్తులపై మోజో తెలియట్లేదు కానీ.. అక్రమ సంబంధాలు పెట్టుకుని జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. కుటుంబాలను రోడ్డునపడేసుకుంటున్నారు. అప్పటికే పెళ్లై పిల్లలున్న మహిళలు, పురుషులు ఇతర వ్యక్తులతో కొత్త సంబంధాలను ఏర్పర్చుకుని ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది. 33 ఏళ్ల వివాహిత 25 ఏళ్ల యువకుడితో ప్రేమాయణం కొనసాగించింది. చివరకు అతిడి చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ఓయో హోటల్‌ రూమ్‌లో తన ప్రేయసిని ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చేసింది.

Also Read:Central Bank Of India Recruitment 2025: జస్ట్ డిగ్రీ పాసైతే చాలు.. 4500 బ్యాంకు జాబ్స్ మీవే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని కెంగేరికి చెందిన హరిణి(33), దాసేగౌడకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఏ చీకూచింతా లేకుండా సాగుతున్న వీరి కాపురంలో మూడో వ్యక్తి చేరి చిచ్చు పెట్టాడు. ఇటీవల హరిణికి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ యశస్‌ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి అక్రమసంబంధానికి దారితీసింది.

Also Read:TGSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు భారీ షాక్.. 20 శాతం పెరిగిన బస్ పాస్ రేట్లు

ఈ విషయం హరిణి భర్త దాసేగౌడకు తెలియడంతో ఆమెను హెచ్చరించాడు. ఆమె వద్ద నుంచి ఫోన్‌ తీసుకున్నాడు. దీంతో, హరిణి తన తప్పును తెలుసుకుని.. భర్త వద్ద కన్నీరుపెట్టుకుని తనను క్షమించాలని కోరింది. భార్యపై నమ్మకం ఉన్న దాసేగౌడ తిరిగి ఫోన్ ఇచ్చేశాడు. ఇక్కడే కథ మళ్లీ మొదటికొచ్చింది. మళ్లీ హరిణితో యశస్‌ కంటాక్ట్‌లోకి వచ్చాడు. ఆమెతో మాట్లాడాలి అని ఫోన్‌ చేసి బెంగళూరులోని ఓ హోటల్‌ గదికి పిలిచాడు.

Also Read:SSMB 29 : రాజమౌళి- మహేశ్ బాబు మూవీ రిజెక్ట్ చేసిన స్టార్ హీరో..

దీంతో, శుక్రవారం వీరద్దరూ పూర్ణ ప్రజ్ఞ లేఅవుట్‌లోని ఓయో హోటల్‌కు వెళ్లి గది అద్దెకు తీసుకున్నారు. హరిణిని తనతోపాటే ఉండాలని యశస్‌ కోరాడు. అందుకు తను ఒప్పుకోలేదు. ప్రియురాలు ఎక్కడ దూరమవుతదేమోనని యశస్ ఆందోళనకు గురయ్యాడు. క్షణికావేశంతో కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచి పరారయ్యాడు. హరిణి అక్కడికక్కడే చనిపోయింది. ఓయో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సుబ్రహ్మణ్యపుర పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు యశస్ ను అరెస్ట్ చేశారు.

Exit mobile version