Site icon NTV Telugu

Team India Women Coach: టీమిండియాకు కొత్త కోచ్.. బీసీసీఐ కీలక నిర్ణయం

Nicholas Lee Coach

Nicholas Lee Coach

Team India Women Coach: భారత మహిళా క్రికెట్ జట్టుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జట్టుకు త్వరలో కొత్త స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ వస్తారని పేర్కొంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2026) తర్వాత ఈ కోచ్ నియమితులవుతారని సమాచారం. కోచ్‌గా బీసీసీఐ ఒక విదేశీ అనుభవజ్ఞుడిని తీసుకొస్తుంది. WPL 2026 తర్వాత, భారత మహిళా జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో జట్టుకు కొత్త స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌ అదనపు బలాన్ని తీసుకొస్తాడని బీసీసీఐ ఆశిస్తుంది. ఇంతకీ ఆ విదేశీ కోచ్ ఎవరు, ఆయనకు ఉన్న అనుభవం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ పునఃప్రారంభం.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా..?

భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇంగ్లాండ్‌కు చెందిన నికోలస్ లీని టీమిండియా మహిళా జట్టు కొత్త స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా నియమించాలని నిర్ణయించింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 ముగిసిన తర్వాత ఆయన జట్టులో చేరనున్నారు. ఈ సంవత్సరం WPL జనవరి 9న ప్రారంభమై ఫిబ్రవరి 5 వరకు కొనసాగుతుంది. ఇది ముగిసిన వెంటనే, భారత మహిళా జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరుతుంది. ఇక్కడ ఫిబ్రవరి 15 నుంచి మార్చి 9 వరకు వివిధ ఫార్మాట్లలో సిరీస్‌లు జరుగుతాయి.

ఇంగ్లాండ్‌కు చెందిన నికోలస్ లీకి క్రికెట్, ఎలైట్ క్రీడలలో విస్తృత అనుభవం ఉంది. ఆయన మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్‌. ఆయన 13 మ్యాచ్‌ల్లో 490 పరుగులు చేశాడు. ఇటీవల ఆయన UAE ILT20 లీగ్‌లో గల్ఫ్ జెయింట్స్ జట్టుతో కలిసి పనిచేశాడు. దీనికి ముందు, జనవరి 2024 నుంచి డిసెంబర్ 2025 వరకు ఆయన ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా పనిచేశాడు. అలాగే ఆయన మార్చి 2020 నుంచి జనవరి 2024 వరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో కలిసి వర్క్ చేశాడు.

దేశీయ స్థాయిలో లీ మార్చి 2012 నుంచి సెప్టెంబర్ 2016 వరకు సస్సెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్‌లో లీడ్ ట్రైనర్‌గా ఉన్నాడు. అంతకు ముందు జనవరి 2010 నుంచి మార్చి 2012 వరకు అసిస్టెంట్ ట్రైనర్‌గా కూడా పనిచేశారు. ఆయన ఆంగ్లియా రస్కిన్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు. సవాలుతో కూడిన ఆస్ట్రేలియా పర్యటన దృష్ట్యా, లీ నియామకం భారత మహిళా జట్టుకు ముఖ్యమైనదిగా క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన నైపుణ్యం జట్టు ఫిట్‌నెస్, ప్రదర్శనలో కొత్త శక్తిని నింపుతుందని భావిస్తున్నారు.

READ ALSO: Ballari Tension: బళ్లారిలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిపై హత్యాయత్నం

Exit mobile version