Site icon NTV Telugu

Team India Schedule: ఇంగ్లండ్ పర్యటనలో మూడు భారత జట్లు.. జులై షెడ్యూల్ ఇదే!

Team India

Team India

ప్రస్తుతం మూడు భారత జట్లు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాయి. సీనియర్ పురుషుల జట్టు ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆడుతుండగా.. మహిళల జట్టు టీ20 సిరీస్‌ను ఆడుతోంది. మరోవైపు ఆయుష్ మాత్రే అండర్-19 జట్టు కూడా ఇంగ్లండ్‌లోనే పర్యటిస్తోంది. ఇంగ్లీష్ యువ జట్టుతో ఆయుష్ మాత్రే టీమ్ మ్యాచ్‌లు ఆడుతోంది. మొత్తంగా భారత క్రికెటర్స్ అందరూ ఇంగ్లండ్‌లోనే ఉన్నారు. ఇక జులైలో భారత క్రికెట్ జట్టు పూర్తి షెడ్యూల్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.

భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్:
భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. రెండవ మ్యాచ్ జులై 2 నుండి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. జులై లో శుభ్‌మాన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు 4 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది.

జులై 2 నుండి 6 వరకు 2వ టెస్ట్
వేదిక: ఎడ్జ్‌బాస్టన్
సమయం: మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది

జులై 10 నుండి 14 వరకు 3వ టెస్ట్
వేదిక: లార్డ్స్
సమయం: మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది

జులై 23 నుండి 27 వరకు 4వ టెస్ట్
వేదిక: ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్
సమయం: మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది

జులై 31 నుండి ఆగస్టు 4 వరకు 5వ టెస్ట్
వేదిక: ది ఓవల్
సమయం: మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది

భారత మహిళల క్రికెట్ షెడ్యూల్:
భారత మహిళా జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆడుతోంది. మొదటి మ్యాచ్‌లో స్మృతి మంధాన సెంచరీతో భారత్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. రెండవ మ్యాచ్ జూలై 1న జరుగుతుంది.

జులై 1న రెండవ టీ20 మ్యాచ్:
వేదిక: సీట్ యునిక్ స్టేడియం
సమయం: రాత్రి 11:00 గంటలు

జులై 4న మూడవ టీ20 మ్యాచ్:
వేదిక: ది ఓవల్
సమయం: సమయం: రాత్రి 11:05

జూలై 9న నాలగవ టీ20 మ్యాచ్:
వేదిక: ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్
సమయం: సమయం: రాత్రి 11:00 గంటలకు

జులై 12న ఐదవ టీ20 మ్యాచ్:
వేదిక: ఎడ్జ్‌బాస్టన్
సమయం: సమయం: రాత్రి 11:05

జులై 16న మొదటి వన్డే:
వేదిక: ది అగేస్ బౌల్
సమయం: సాయంత్రం 5:30 నుండి ప్రారంభమవుతుంది

జులై 19న రెండవ వన్డే:
వేదిక: లార్డ్స్
సమయం: మధ్యాహ్నం 3:30 గంటల నుండి

జులై 22న మూడో వన్డే:
వేదిక: రివర్‌సైడ్ గ్రౌండ్
సమయం: సాయంత్రం 5:30 నుండి ప్రారంభమవుతుంది

Exit mobile version