టీమిండియా జట్టు ఇటీవలే అన్ని ఫార్మాట్లలో జెర్సీలను మార్చింది. కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అడిడాస్ వచ్చాక టీమిండియా పురుషుల టీమ్ తో పాటు ఉమెన్స్ జట్టుకు కూడా మూడు ఫార్మాట్లలో వేర్వేరు జెర్సీలను అడిడాస్ రూపొందించింది. టీ20ల్లో కాలర్ లేకుండా డార్క్ బ్లూ కలర్ జెర్సీ, వన్డేల్లో కాలర్‌తో లైట్ బ్లూ కలర్ జెర్సీ, టెస్ట్‌ల్లో వైట్ కలర్ జెర్సీలను అడిడాస్ తీసుకోచ్చింది. అయితే, జెర్సీలపై కుడివైపు అడిడాస్ లోగోను, ఎడమవైపు బీసీసీఐ టీమ్ లోగో.. దానిపై మూడు నక్షత్రాలు, మధ్యలో లీడ్ స్పాన్సర్ డ్రీమ్ 11 పేరు, దాని కింద కాస్త పెద్ద అక్షరాలతో ఇండియా అని రాసి ఉంది. జెర్సీపై భుజాల భాగంలో మూడు తెలుపు రంగు అడ్డ గీతలు ఉంటాయి.
Read Also: Karima Baloch: ఖలిస్తాన్ ఉగ్రవాది హత్యపై కెనడా గగ్గోలు.. కరీమా బలూచ్ హత్యపై మాత్రం సైలెన్స్..
కాగా, వరల్డ్‌కప్ నేపథ్యంలో అడిడాస్ కంపెనీ జెర్సీలో స్వల్ప మార్పులు చేర్పులు చేసింది. ఇక, భుజాలపై ఉన్న మూడు అడ్డ గీతలపై తెలుపు రంగు స్థానంలో తివర్ణ పతాకంలోని మూడు రంగులను (కాషాయం, తెలుపు, ఆకుపచ్చ) ముద్రించడంతో పాటు టీమ్ లోగోపై ఉన్న మూడు నక్షత్రాలను రెండుగా చేసింది.. ఆ రెండు నక్షత్రాలు భారత్ జట్టు సాధించిన రెండు వన్డే వరల్డ్‌కప్‌లు (1983, 2011) గెలిచిన దానికి ప్రతీక అని అడిడాస్ పేర్కొనింది. భారత జట్టు కొత్త జెర్సీపై భారతీయత ఉట్టిపడటంతో భారత క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తివర్ణంతో కూడిన జెర్సీతో టీమిండియా వరల్డ్‌కప్ గెలవడం ఖాయమని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఆటగాళ్లు కొత్త జెర్సీ ధరించి రూపొందించిన వీడియో అద్భుతంగా ఉందని నెటిజన్స్ వ్యాఖ్యనిస్తున్నారు. పాత జెర్సీతో పోలిస్తే, ఇది చాలా కలర్‌ఫుల్‌గా ఉండటంతో పాటు భారతదేశ్ గొప్పతనాన్ని చాటుతుందని పేర్కొన్నారు.
Read Also: Mahesh Babu: అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాల్లో మహేష్ బాబు
1983 ignited the spark.
2011 brought in glory.
2023 marks the beginning of #3KaDream. pic.twitter.com/1eA0mRiosV— adidas (@adidas) September 20, 2023