NTV Telugu Site icon

IND vs AUS: వ్యక్తిగత కారణాల వల్ల ఇండియాకు గౌతం గంభీర్..

Gautam Gambhir

Gautam Gambhir

భారత క్రికెట్ జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ ‘వ్యక్తిగత కారణాల’ కారణంగా మంగళవారం (నవంబర్ 26) ఆస్ట్రేలియా నుండి స్వదేశానికి తిరిగి రానున్నారు. అయితే డిసెంబర్ 6 నుండి అడిలైడ్‌లో ప్రారంభమయ్యే రెండవ టెస్ట్ మ్యాచ్‌కు ముందు జట్టుతో చేరనున్నారు. గంభీర్ స్వదేశానికి తిరిగి వచ్చి రెండవ టెస్ట్ మ్యాచ్‌కి ముందు జట్టులో చేరతానని తమకు తెలియజేసినట్లు బీసీసీఐ తెలిపింది. అతను వ్యక్తిగత కారణాల గురించి తమకు చెప్పడంతో అతని అభ్యర్థనను బీసీసీఐ ఆమోదించింది.

Read Also: Cricket Umpire: క్రికెట్ అంపైర్ ఎలా అవ్వాలి.? జీతం ఎంతొస్తుందంటే..

పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు టీమిండియా బుధవారం కాన్ బెర్రా వెళ్లనుంది. డిసెంబర్ 6 నుంచి పింక్ బాల్ టెస్టు ప్రారంభ కానుంది. గౌతమ్ గంభీర్ గైర్హాజరీతో టీమిండియా సహాయ కోచ్‌లు అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డోస్చాట్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ కెప్టెన్ రోహిత్ శర్మతో సంప్రదింపులు జరిపి శిక్షణా సమావేశాలను పర్యవేక్షిస్తారు. రెండో టెస్టు కోసం రోహిత్ శర్మ ఆదివారం ఆస్ట్రేలియా చేరుకున్నాడు. తనకు కొడుకు పుట్టిన కారణంగా తొలి టెస్టుకు దూరమైన రోహిత్ శర్మ సోమవారం పెర్త్‌లో ప్రాక్టీస్ సెషన్‌లో కనిపించాడు.

Read Also: Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్ ను వీడిన పంత్.. 9ఏళ్ల ప్రయాణంపై ఎమోషనల్‌ పోస్టు (వీడియో)

స్వదేశంలో న్యూజిలాండ్‌పై 0-3తో క్లీన్ స్వీప్ చేసి ఆస్ట్రేలియాకు వచ్చిన భారత జట్టుపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో రోహిత్ శర్మ గైర్హాజరీలో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆస్ట్రేలియాను 395 పరుగుల తేడాతో ఓడించిన భారత జట్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.