Site icon NTV Telugu

Yashasvi Jaiswal: ఆస్పత్రిలో చేరిన టీమిండియా క్రికెటర్..

Yashasvi Jaiswal

Yashasvi Jaiswal

Yashasvi Jaiswal: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ యశస్వి జైస్వాల్ పూణేలోని ఆదిత్య బిర్లా ఆసుపత్రిలో చేరారు. హర్యానాతో జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగాఈ ప్లేయర్‌కు తీవ్ర అస్వస్థత ఏర్పడింది. మ్యాచ్ తర్వాత జైస్వాల్ తీవ్ర అస్వస్థతకు గురికాగా, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలో యశస్వి జైస్వాల్‌ కడుపులో వాపు ఉన్నట్లు తేలిందని వైద్యులు తెలిపారు. CT స్కాన్, అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించగా, జైస్వాల్‌కు తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు.

READ ALSO: Boomi Humanoid Robot: ప్రపంచంలోనే అత్యంత చౌకైన రోబో.. ఐఫోన్ ధరకే..

ప్రస్తుతానికి యశస్వి జైస్వాల్ క్రికెట్ ఆడకూడదని వైద్యులు సూచించారు. ఈ స్టార్ బ్యాట్స్‌మెన్‌కు ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ఆయన త్వరలో కోలుకుంటాడని అందరూ భావిస్తున్నారు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ఈ స్టార్ ప్లేయర్ అసాధారణంగా రాణించాడు. హర్యానాపై కేవలం 50 బంతుల్లోనే 101 పరుగులు చేసి, జట్టును విజయపథంలో నడిపించాడు. అయితే అనారోగ్య కారణాల వల్ల ఇప్పుడు జైస్వాల్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. నిజానికి టీ20 జట్టులో ఈ ప్లేయర్‌కు చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ తర్వాత, టీమిండియా నెక్ట్స్ సిరీస్ వచ్చే ఏడాది స్టార్ట్ కానుంది. జనవరిలో న్యూజిలాండ్ ఇండియాలో పర్యటిస్తుంది. ఈ టైంలో భారత్ – న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. వన్డే సిరీస్ జనవరి 11న, టీ20 సిరీస్ జనవరి 21న ప్రారంభం కానున్నాయి.

READ ALSO: David Reddy: మరిగే రక్తం నిప్పులు కక్కింది.. గుండె వేగానికి నేల కదిలింది.. ‘డేవిడ్ రెడ్డి’ గ్లింప్స్ చూశారా!

Exit mobile version