Site icon NTV Telugu

Boy Teacher Romance : బాలుడితో టీచర్ రొమాంటిక్ ఛాటింగ్.. పేరెంట్స్‎కు తెలిసి..

Boy Teacher Romance

Boy Teacher Romance

Boy Teacher Romance : తల్లిదండ్రుల తర్వాత గురువుకే పెద్ద పీఠ వేశారు పెద్దలు. అలాంటి ఉన్నతస్థానంలో ఉన్న గురువులు తమ స్థాయి మరచిపోయి ప్రవర్తిస్తున్న ఘటనలు తరచూ ఎదురవుతూనే ఉన్నాయి. వావివరసలు మరిచిపోయి కామాంధులు చెలరేగిపోతున్నారు. తన కంటే చిన్న వాళ్లను లైంగికంగా వేధిస్తున్నారు. విద్య నేర్పాలిన గురువులే తన వద్ద చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటరు తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. తన వద్దకు ట్యూషన్ కోసం వచ్చిన ఓ పదో తరగతి విద్యార్థితో లేడీ టీచర్ రొమాంటిక్ చాటింగ్ చేసింది. ఈ విషయం బాలుడి తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

Read Also:Ghee: నెయ్యి ఆరోగ్యమే కాదు అందాన్ని కూడా పెంచుతుంది

వివరాల్లోకి వెళితే..తిరుచ్చి జిల్లాలోని దురైయూర్ సమీపంలోని ఉప్పిలియాపురానికి దేవి (40) అనే ఓ టీచర్.. దురయూర్ గ్రామంలో ఉంటుంది. ఆమె, పొద్దున సాయంత్రం ఇంటిదగ్గర ట్యూషన్లు చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఆమె వద్దకు వచ్చే ఒక విద్యార్థి మీద ఆమె కన్ను పడింది. పదో తరగతి చదివే ఒక బాలుడిని తాను ముగ్గులోకి దింపింది. అతనితో అశ్లీల చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. ఈ విషయం ఆ స్టూడెంట్ పేరెంట్స్ కు తెలిసింది. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఆ టీచరుపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా మొబైల్ చాటింగ్ చేసిన సంగతి వాస్తవమేనని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో దేవిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

Read Also:AP SSC Results 2023: టెన్త్‌ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Exit mobile version