Site icon NTV Telugu

Teacher Dance: డాన్స్‭తో రెచ్చిపోయిన పంతులమ్మ.. తిట్టిపోస్తున్న నెటిజన్లు..

Teacher Dance

Teacher Dance

Teacher Dance: ఈమధ్య కాలంలో చాలామంది ఉపాధ్యాయులు స్కూల్‌, కళాశాలలో అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా కాస్త ఆలస్యంగా ఉపాద్యాయుల దినోత్సవం రోజున ఓ టీచర్ చేసిన డాన్స్ వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఒక లేడి టీచర్ తన విద్యార్థుల ముందు ఓ భోజ్‌పురి పాటకు చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది.

Mallu Bhatti Vikramarka: రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించండి.. వాటాను 50% పెంచండి..

ఆ టీచర్ నల్ల చీర కట్టుకొని చాలా హాట్ గా డ్యాన్స్ చేస్తుంటే, అక్కడ విద్యార్థులు ఆమె చుట్టూ కూర్చుని ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియోను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తీసినట్లుగా అక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటో చూస్తుంటే అర్థమవుతుంది. ఇకపోతే సోషల్ మీడియాలో అప్లోడ్ అయిన ఆ వీడియోపై ఇప్పుడు చాలా విమర్శలు చేస్తున్నారు. చాలామంది నెటిజన్లు ఆ మహిళా టీచర్ డ్యాన్స్ చేసిన తీరును “సిగ్గుమాలిన టీచర్” నిర్వాహకం అని అంటున్నారు. ఈ డాన్స్ చాలా అశ్లీలంగా ఉందని, చిన్న పిల్లలకు ఇలాంటివి చూపించడం సరికాదని నెటిజన్లు అంటున్నారు. ఇంకొక నెటిజన్ కామెంట్ చేస్తూ.. ఇంతకంటే పెద్ద సిగ్గుచేటు ఏముంటుంది..? ఒక మహిళా ఉపాధ్యాయురాలు స్వయంగా ఇలాంటి పాటలకు డాన్స్ చేయడం, అదీ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం రోజున అని మండిపడ్డాడు. ఇక మరికొందరైతే.. ఇలాంటి స్కూళ్లు ఉంటే విలువలు ఎక్కడి నుంచి వస్తాయి..? అంటూ కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version