మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలో మంత్రాలయం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కరెడ్డి, ఉరుకుంద(ఈరన్న) లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం నాగరాజు స్వామి సేవా సంఘం హాల్ నందు జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొని పాలకుర్తి తిక్కరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు పార్టీకి వెన్నెముక లాగా ఉన్నారని, బీసీల పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ, బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు పెంచి, బీసీ సబ్ ప్లాన్, ఆదరణ పథకాలు అందించి బీసీలను అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదన్నారు. ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలలో బీసీల రక్షణ చట్టం, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు 34 శాతం ఉన్న రిజర్వేషలను 24 శాతంకు తగ్గించి బీసీ సబ్ ప్లాన్ నిధులను వేరే పథకాలకు మళ్లించి ఆదరణ పథకాలను పూర్తిగా రద్దుచేసి బీసీలపైన బీసీ నాయకుల పైన అనేక అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న బీసీల ద్రోహి జగన్ రెడ్డి అని ఆయన అన్నారు.
మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు అనేక నామినేటెడ్ పోస్టులు,పార్టీలో అనేక కీలక పదవులు ఇప్పించి ఎంతోమంది బీసీ నాయకులను జడ్పిటిసి లుగా,ఎంపీపీ లుగా,సర్పంచ్ లుగా, ఎంపిటిసిలుగా చేసి ప్రోత్సహించామన్నారు. మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి బీసీలను ఒక్కరిని కూడా ఎదగకుండా అన్ని రకాలుగా అణగాతొక్కుతున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడు , టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చన్న బసప్పదని, క్లస్టర్ ఇంచార్జిలు వెంకటపతి రాజు, కొట్రెష్ గౌడ్, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి విజయరామరెడ్డి, నీలకంఠ రెడ్డి, టిప్పు సుల్తాన్, రాజానంద్, బాపూరం వెంకటరెడ్డి, దమ్ముల్దిన్నె రమేష్ గౌడ్, కురుగోడు, రాజబాబు, రహిమాన్, తిప్పలదొడ్డి మల్లయ్య, ఎరిగిరి బసవరాజు, రమేష్, నరసింహులు, ఈరప్ప, తిక్కయ్య, ఐ టీడీపీ దిద్ది ఉసేని, మండలంలోని అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.