Site icon NTV Telugu

Buddha Venkanna: పరామర్శ జగన్ పేటెంట్ హక్కు కాదు

Buddha Venkanna

Buddha Venkanna

రాష్ట్రంలో అధికార పార్టీ, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ కనుసైగలతో పోలీసులు ప్రజల్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారన్నారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న. ఇదే తీరు కొనసాగితే సహనం నశించి తాడేపల్లి ప్యాలెస్సును చుట్టుముడతాం.మా సహనాన్ని ఇంకా పరీక్షిస్తే, శ్రీలంకలా మరో ప్రజా చైతన్యం చూడాల్సి వస్తుంది. డీజీపీ తన పోలీసు సిబ్బందికి రాష్ట్ర ఖజానా నుంచి జీతాలు చెల్లిస్తున్నారా లేక జగన్ దోచుకున్న సంపదను జీతంగా ఇస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు.

Read Also:KTR On Bandi Sanjay: అమిత్ షాకు ఉరికి ఉరికి చెప్పులు తొడగడం తెలంగాణ ఆత్మగౌరవమా ?

లోకేష్ శ్రీకాకుళం పర్యటనను అడ్డుకోవటమే కాకుండా విశాఖలో మీడియా సమావేశం అడ్డుకోవడం చూస్తే ఎవరికైనా పోలీసులు తీరుపై అనుమానం కలగక మానదు. లోకేష్ జగనులా సొంత బాబాయిని హత్య చేయించ లేదు, విశాఖలో విజయసాయిలా భూకబ్జాలకు పాల్పడలేదు. గోరంట్ల మాధవ్, కొడాలి నానిల్లా పిచ్చిపట్టినట్లు తెలుగుదేశం నేతలు ఎవరూ ప్రవర్తించట్లేదు. పశువుల మంత్రి పలాసలో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలని వేధిస్తుంటే, లోకేష్ పరామర్శించాలని అనుకోవడం తప్పా..?

పరామర్శనేది జగన్ పేటెంట్ అని పోలీసులు భావిస్తున్నారా? బయటకు రావటానికి భయపడి పోలీసులతో కావాలనే గృహ నిర్బంధం చేయించుకుని కృతజ్ఞతలు తెలిపిన పిరికోడు మంత్రి సీదిరి అప్పలరాజు. ఒక్కసారి ఓటేసిన పాపానికి శాశ్వత నరకాసుర పాలన ప్రజలేమీ కోరుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి దోపిడీని ప్రశ్నిస్తున్నందుకే ఇలా తెలుగుదేశం నేతల పర్యటనల్ని అడ్డుకుంటున్నారా..? అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.

Read Also: India VS Zimbabwe 3rd ODI: క్లీన్​స్వీప్ పై టీమిండియా గురి.. నేడు జింబాబ్వేతో మూడో వన్డే

Exit mobile version